పవన్‌ కళ్యాణ్‌ పై బండ్ల సంచలన ట్వీట్‌…రికార్డులు తిరగరాసే సినిమా చేయ్‌ !

-

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఒకప్పుడు సినిమా ఫంక్షన్ల వేదికలపై మాట్లాడిన స్పీచులు గుర్తుకు వచ్చేవి. ఇప్పుడైతే రాజకీయాల్లోకి మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తాయి. రాజకీయాల్లోకి దిగి.. కోటలు దాటే మాటలతో నవ్వుల పాలయ్యాడు. ఇది ఇలా ఉండగా… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఎంత అభిమానం ఉందో అందరికీ తెలిసిందే.

పవన్ ను ఆయన సాక్షాత్తు దేవుడి గానే భావిస్తుంటారు. సమయం వచ్చినప్పుడల్ల పవన్ పై ఉన్న అభిమానాన్ని ఆయన చాటుకుంటూనే ఉంటారు. తాజాగా మరోసారి తన స్వామి భక్తిని ట్విట్టర్ ద్వారా చాటుకున్నారు. మిమ్మల్ని అర్థం చేసుకొని, మిమ్మల్ని ప్రేమిస్తూ, మీ ప్రేమను పొందుతూ సినిమా తీస్తే బాక్స్ బద్దలే అని ట్విట్ చేశారు. తన దైవ సమానులైన పవన్ తెలుగు చలనచిత్ర చరిత్రలో రికార్డులు తిరగరాసే సినిమాను త్వరగా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news