రూ.2 లక్షలకు యువతిని అమ్మేసిన పక్కింటి వ్యక్తి

-

ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫ్యాక్టరీలో పనిచేసే ఓ యువతిని విహారయాత్రకు తీసుకెళ్తానని నమ్మించి.. ఆమె పొరుగింట్లో ఉండే వ్యక్తి రూ.2 లక్షలకు అమ్మేశాడు. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

పోలీసుల వివరాల ప్రకారం.. బిహార్​లోని రోహ్తస్​ జిల్లాకు చెందిన బాధితురాలు.. హరిద్వార్​లోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ అదే ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తోంది. అయితే ఆమె పొరుగింట్లో ఉండే రాజ్​కుమార్​ అనే వ్యక్తితో బాధితురాలు క్లోజ్​గా ఉండేది. ఆమెను మామ అని పిలిచేది. అయితే ఓ రోజు విహారయాత్రకు తీసుకెళ్తానని చెప్పి బాధితురాల్ని రాజ్​కుమార్​.. యూపీలోని సహరాన్​పుర్​ జిల్లాకు తీసుకెళ్లాడు. అక్కడ నీతు గుర్జార్​ అనే వ్యక్తికి రూ.2 లక్షలకు అమ్మేశాడు.

ఆ తర్వాత బాధితురాల్ని బలవంతంగా పెళ్లి చేయడానికి ప్రయత్నించాడు నీతు గుర్జార్. అందుకు ఆమె నిరాకరించడం వల్ల రెండు నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. కొన్ని రోజుల క్రితం బాధితురాలు.. నీతు గుర్జార్​ బారి నుంచి తప్పించుకుని హారిద్వార్​ చేరుకుంది. సిడ్‌కుల్ పోలీస్ స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో బాధితురాలు దెహ్రాదూన్​కు వెళ్లి డీఐజీ గర్వాల్‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే డీఐజీ ఆదేశాల మేరకు సిడ్‌కుల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news