కేసీఆర్ మాయమాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు : వైఎస్ షర్మిల

-

ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కూడలిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె కేసీఆర్ సర్కార్​పై విరుచుకుపడ్డారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి పథకాలు ఆయన చేసి చూపించారని అన్నారు.

వైఎస్ ఉన్నప్పుడు చేసిన 90% పథకాలే నేటికీ నడుస్తున్నాయని అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చేముందు దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇలా ఇస్తానని మాయమాటలు చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 35 వేల కోట్లు ఉన్న పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు వ్యయాన్ని 55 వేల కోట్లకు పెంచారని మండిపడ్డారు. కమీషన్లు తిన్నా ఈ ప్రాజెక్టు నేటి వరకు పూర్తి కాలేదని విమర్శించారు.

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డిని ఓడించి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. కొడంగల్​లో చెల్లని రూపాయి రాష్ట్ర మొత్తం మీద చెల్లుతుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే టీఆర్ఎస్​కు వేసినట్లేనని అన్నారు. కాంగ్రెస్​లో గెలిచిన ఎమ్మెల్యేలు తెరాస డబ్బులకు అమ్ముడు పోతున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి.. వికారాబాద్ జిల్లా వైఎస్ఆర్​టీపీ అధ్యక్షుడు తమ్మలి బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు

Read more RELATED
Recommended to you

Latest news