కోమటి రెడ్డిపై అద్దంకి చేసిన వ్యాఖ్యలు తప్పే – మధుయాష్కీ

-

కోమటి రెడ్డిపై అద్దంకి చేసిన వ్యాఖ్యలు తప్పేనని మునుగోడు వ్యూహ ప్రచార కమిటీ కన్వీనర్ మధుయాష్కీ ఫైర్‌ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికలపై కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డితో అధిష్టానం మాట్లాడుతోందని వెల్లడించారు. కాంగ్రెస్‌ ను ఖతం చేసేందుకు కుట్ర జరుగుతోందని నిప్పులు చెరిగారు. రాజగోపాల్ రెడ్డి కి మాట్లాడే అవకాశం వచ్చిందంటే కాంగ్రెస్ వల్లేనని… బీజేపీ టీఆరెస్ లు కుమ్మక్కు రాజకీయాలు అని ఆగ్రహించారు.

రాజగోపాల్ రెడ్డి 5 నిమిషాల్లో రాజీనామా ఆమోదం దానికే సంకేతమని నిప్పులు చెరిగారు. ఎవరికి టికెట్ ఇచ్చిన అందరం కలిసి పని చేయాలని ఆదేశించారు. సర్వే ఆధారంగానే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని.. కాంగ్రెస్ బలంగా ఉందని వెల్లడించారు. తెలంగాణ లో కాంగ్రెస్ సచ్చిపోయిందంటున్న రాజగోపాల్ రెడ్డి కి మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చిందే కాంగ్రెస్ అని తెలిపారు. మునుగోడులో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని తెలిపారు మధుయాష్కీ.

Read more RELATED
Recommended to you

Latest news