చందబాబు సలహాలు తీసుకోనుంటే..శ్రీలంకలో సంక్షోభం రాకపోవు – విజయసాయి

-

చందబాబు సలహాలు తీసుకోనుంటే..శ్రీలంకలో సంక్షోభం రాకపోవు అంటూ చంద్రబాబు పై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన పై వ్యంగ్యాస్త్రాలు వదిలారు విజయసాయిరెడ్డి. గుజరాత్ సీఎంగా పుష్కరకాలం చేసి, మూడోసారి కూడా నేనే దేశ ప్రధానిగా ఎన్నికవుతానన్న భరోసాకు కారణం దేశంలోనే స్వయంప్రకటిత సీనియర్ మోస్ట్ నాయకులైన మీరే చంద్రబాబుజీఅంటూ చురకలు అంటించారు విజయసాయిరెడ్డి.

ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు లేకపోవడం తీరని లోటే అని ఆమధ్య ఢిల్లీలో మోదీ గారు బాబుతో అన్నారని పచ్చకుల మీడియా ఉవాచ! నీతిఆయోగ్‌కు మీ సలహాలు, మీరే ప్రభుత్వంలో ఉండుంటే చైనాతో గొడవ, ద్రవ్యోల్బణం, దేశ ఆర్థికస్థితి, శ్రీలంకలో సంక్షోభం రాకపోవన్నారు. గేట్స్‌కు కంప్యూటర్ కోర్సు, అమరావతి నిర్మాణం అన్నీ మీకే సాధ్యం చంద్రబాబుజీ అని మోదీ గారు బాబు భుజం మీద ప్రేమతో చుర్రుమనేట్లు చరిచారని టీడీపీ భోగట్టా! అంటూ ఓ రేంజ్‌ సెటైర్లు పేల్చారు విజయసాయి.

Read more RELATED
Recommended to you

Latest news