BREAKING : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. కాసేపటి క్రితమే.. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశానికి మంత్రులతో పాటు నల్గొండ జిల్లా నేతలు కూడా హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్రానికి అదనపు నిధుల సమీకరణపై ఈ భేటీలో చర్చ జరుగుతోంది. అలాగే కొత్త పింఛన్‌లకు ఆమోదం తెలపనుంది తెలంగాణ రాష్ట్ర కేబినెట్.. ఆగస్టు 15 నుంచి 10 లక్షల పింఛన్‌లు ఇచ్చేలా చర్యలు తీసుకోనుంది తెలంగాణ కేబినేట్.
అలాగే..అదనపు ఆదాయవనరుల సమీకరణకు సంబంధించిన కీలక నిర్ణయాలతో పాటు అనాథలకు భరోసా, 57 ఏళ్ల వారికి పింఛన్లు, స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదల, పలు ఉత్తర్వులకు ఆమోదం వంటి తదితర అంశాలు ఇందులో ఉన్నాయి. మునుగోడులో ఉప ఎన్నికల వేడి మొదలుకావడంతో మంత్రిమండలిలో అధికారిక ఎజెండా ముగింపు అనంతరం దానిపైనా సీఎం చర్చించే అవకాశం ఉంది.