‘కారు’ ఎన్టీఆర్ ప్రత్యర్ధి మంటలు?

-

అధికార టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువ ఉన్నాయనే సంగతి తెలిసిందే…చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య సఖ్యత లేదు. అలాగే సీట్ల విషయంలో పెద్ద రచ్చ నడుస్తోంది…అలాగే కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కొందరు నేతలు పావులు కదుపుతున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా సిట్టింగులకు చెక్ పెట్టి సీటు దక్కించుకోవాలని చెప్పి కొందరు నేతలు ట్రై చేస్తున్నారు. ఇలా సీటు విషయంలో నేతల మధ్య అంతర్గత పోరు పెరిగిపోయింది.

ఇదే క్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాటలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తోంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా జైపాల్ యాదవ్ ఉన్నారు…ఈయన  గతంలో టీడీపీలో పనిచేశారు..రెండుసార్లు కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. తర్వాత టీడీపీని వదిలి టీఆర్ఎస్ లోకి వచ్చి..2014లో పోటీ చేసి ఓడిపోయారు…2018 ఎన్నికల్లో మాత్రం జైపాల్ యాదవ్ విజయం అందుకున్నారు. అయితే ఈయనపై ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉందని తెలుస్తోంది. పైగా ఇక్కడ బీజేపీ బలపడుతుంది…వచ్చే ఎన్నికల్లో ఈ సీటు బీజేపీకే దక్కవచ్చని సర్వేలు చెబుతున్నాయి.

ఇలాంటి తరుణంలో ఇంకా బలపడాల్సింది పోయి..సొంత పోరుతో కారు పార్టీ వీక్ అవుతుంది. ఇప్పటికే ఎమ్మెల్యే జైపాల్…ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిల మధ్య వార్ నడుస్తోంది…ఈ రెండు గ్రూపులకు ఏ మాత్రం పడటం లేదు. ఇక వీరి మధ్య మరో గ్రూపు వచ్చింది. మాజీ ఎమ్మెల్యే చిత్తరంజన్ దాస్ లైన్ లోకి వచ్చారు.

గతంలో ఈయన కాంగ్రెస్ లో పనిచేశారు…పైగా 1989లో కల్వకుర్తి నుంచి ఎన్టీఆర్ పోటీ చేశారు. కానీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన చిత్తరంజన్..ఎన్టీఆర్ ని ఓడించారు. అయితే చాలాకాలం కాంగ్రెస్ లో పనిచేసిన ఈయన…2018లో టీఆర్ఎస్ లో చేరిపోయారు. కానీ కొంతకాలం నుంచి సైలెంట్ ఉంటున్న ఈయన…ఇప్పుడు దూకుడు పెంచారు. జైపాల్, కసిరెడ్డిల వల్ల పార్టీ నాశమవుతుందని చెప్పుకోస్తున్న ఈయన..నెక్స్ట్ టికెట్ తనదే అంటూ ప్రచారం చేస్తున్నారట. మొత్తానికైతే ఎన్టీఆర్ ప్రత్యర్ధి వల్ల కల్వకుర్తి కారులో మంటలు రేగుతున్నాయని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news