దేశ రాజధానిలో ప‌ట్ట‌ప‌గలే యువ‌కుడి దారుణ హ‌త్య‌

ఓ ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటున్నారు.. ఉన్నట్టుండి.. ఒక్కసారిగా ఓ ఐదురుగు వ్యక్తులు వచ్చి మాట్లాడుకుంటున్న ఆ ఇద్దరి స్నేహితల్లో ఒకరిపై కత్తులతో దాడి చేశారు. అనుకోని సంఘటనను చూసిన రెండో స్నేహితుడు షాక్‌లో ఉన్నాడు.. అప్పటికే ఆ ఐదుగురు వ్యక్తులు తన స్నేహితుడిపై కిరాతకంగా కత్తులతో దాడి చేసి పరారయ్యారు. అయితే వెంటనే తేరుకుని రక్తపు మడుగులో ఉన్న తన స్నేహితుడిని ఆసుపత్రికి చేర్చాడు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఈ దారుణం జ‌రిగింది. ప‌ట్ట‌ప‌గ‌లే ఓ యువ‌కుడిని అతికిరాత‌కంగా హ‌త్య చేశారు. ద‌క్షిణ ఢిల్లీలోని మాల‌వీయ న‌గ‌ర్ మార్కెట్‌లో మ‌యాంక్‌(25) అనే యువ‌కుడు త‌న ఫ్రెండ్‌తో క‌లిసి ఉన్నాడు.

17-Year-Old Murders Ex-Boyfriend With Help of Lover, Buries Body in Jungle

ఓ ఐదుగురు వ్య‌క్తులు మ‌యాంక్ వ‌ద్ద‌కు దూసుకొచ్చారు. అత‌నిపై ప‌దునైన ఆయుధాల‌తో దాడి చేశారు. అనంత‌రం దుండుగులు అక్క‌డ్నుంచి పారిపోయారు. తీవ్ర గాయాల‌పాలైన మ‌యాంక్‌ను స్థానికుల స‌హాయంతో అత‌ని స్నేహితుడు ఎయిమ్స్‌కు త‌ర‌లించాడు. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మ‌యాంక్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ దృశ్యాల‌న్నీ మార్కెట్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లోరికార్డు అయ్యాయి. ఈ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మ‌యాంక్ హోట‌ల్ మేనెజ్‌మెంట్ స్టూడెంట్ అని పేర్కొన్నారు పోలీసులు.