ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రత్యర్థుల చేతిలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరబద్రం సోదరుడు తమ్మినేని కృష్ణయ్య హత్యకు గురయ్యాడు. ఇటీవలనే సీపీఎం నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన కృష్ణయ్యను.. కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. తమ్మినేని కృష్ణయ్య హత్యపై ఆయన అనుచరులు భగ్గుమన్నారు. తెల్దార్ పల్లితెల్దార్ పల్లిలో సిపిఎం దిమ్మెలు ధ్వంసం చేశారు. దీంతో తెల్దార్ పల్లిలో 144 సెక్షన్ విధించారు.
ఘటన స్థలాన్ని పరిశీలించారు సిపి విష్ణు. పొన్నెకల్లు రైతు వేదిక వద్ద జెండా ఎగురవేసి బైక్ పై వెళ్తున్న కృష్ణయ్యను పక్క ప్లాన్ ప్రకారం హత్య చేసారు దుండగులు. దీంతో స్పాట్ లోనే చనిపోయారు కృష్ణయ్య. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్య హత్య జరిగినట్లు చెబుతున్నారు స్థానికులు. ఒంటిపై 12 కత్తిపోట్లు ఉన్నట్లు సమాచారం. హత్యలో ఐదుగురు పాల్గొన్నట్లు సమాచారం.బైక్ పై కృష్ణయ్య వెనక కూర్చోగా ముందు డ్రైవింగ్ చేస్తున్నాడు డ్రైవర్ ముతేష్. ముతేష్ ను బెదిరించి పంపించారు దుండగులు. ఆ తర్వాత కత్తులతో ఏకధాటిగా దాడి చేశారు.
కృష్ణయ్య హత్య నేపథ్యంలో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోదరుడు తమ్మినేని కోటేశ్వరరావు అనుమానితుడిగా భావించి వారి ఇంటిపై దాడి చేసారు కృష్ణయ్య అనుచరులు, స్థానిక గ్రామస్తులు. దీంతో కోటేశ్వరావు ఇంటి వద్ద భారీగా మోహరించారు పోలీసులు. కృష్ణయ్య మృతదేహం ను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో మృతదేహానికి నివాళులు అర్పించారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు. కృష్ణయ్య కుటుంబ సభ్యులను పరామర్శించనున్న తుమ్మల నాగేశ్వరావు. తుమ్మల కు కేటీఆర్ కు కాల్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి కేటీఆర్