పరకాల బరిలో కొండా వారసురాలు?

-

ఎట్టకేలకు వరంగల్ రాజకీయాల్లో తిరుగులేని ఫ్యామిలీగా ఉన్న కొండా ఫ్యామిలీ వారసురాలు సుస్మితా పోలిటికల్ ఎంట్రీ దాదాపు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తల్లిదండ్రులకు అండగా ఉంటున్న సుస్మితా వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తున్నారు. ఇలా దూకుడుగా ఉంటున్న సుస్మితాకు నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.

గతంలోనే తమ వారసురాలుని ఎన్నికల బరిలో దించాలని కొండా మురళీ, సురేఖలు ట్రై చేశారు…కానీ ఒకటే సీటు దక్కే సరికి కొండా సురేఖ పరకాల బరిలో పోటీ చేసి ఓడిపోయారు. వాస్తవానికి కొండా సురేఖ సొంత స్థానం పరకాల. ఇక్కడ గతంలో పలు విజయాలు నమోదు చేశారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు సత్తా చాటారు. కానీ తర్వాత వైఎస్సార్ మరణంతో జగన్ పెట్టిన వైసీపీలోకి వెళ్లారు.

అదే సమయంలో 2012 ఉపఎన్నికలో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కొండా ఫ్యామిలీ టీఆర్ఎస్ లోకి వెళ్లింది. అయితే 2014లో పరకాల లో చల్లా ధర్మారెడ్డి ఉండటంతో…సురేఖ వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే 2018 ఎన్నికలోచ్చేసరికి కొండా ఫ్యామిలీ రెండు సీట్లు ఆశించింది. కానీ టీఆర్ఎస్ అధిష్టానం కొండా ఫ్యామిలీని పట్టించుకోలేదు. దీంతో మళ్ళీ వారు కాంగ్రెస్ లోకి వచ్చేశారు. 2018లో పరకాల నుంచి పోటీ చేసి సురేఖ ఓడిపోయారు.

ఓడిపోయిన దగ్గర నుంచి పరకాలలో బలపడటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే పరకాలలో కాంగ్రెస్ పుంజుకుందని సర్వేలు చెబుతున్నాయి. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి సురేఖ పోటీ చేయరని కొండా మురళీ క్లారిటీ ఇచ్చేశారు. సురేఖ ఈ సారి వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేస్తారని చెప్పారు. అంటే పరకాలలో సుస్మితా పోటీకి లైన్ క్లియర్ అయిందని తెలుస్తోంది. ఇక ఈ రెండు సీట్లు కొండా ఫ్యామిలీకి ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధంగానే ఉంది. మొత్తానికైతే సుస్మితా పరకాల బరిలో దిగే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news