కశ్మీరి పండిట్లే లక్ష్యంగా జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. ఆపిల్ తోటలోకి చొరబడి అక్కడ పని చేస్తున్న వారిలో ఇద్దరు కశ్మీరి పండిట్ సోదరులపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అసదుద్దీన్ ఓవైసీఈ ఘటనపై అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. కశ్మీరి పండిట్లకు రక్షణ కల్పించడంలో కేంద్రం విఫలమైందని ఆయన ఆరోపించారు. పండిట్లకు ప్రయోజనం చేకూరుతుందని ఆర్టికల్ 370 రద్దు చేయబడిందన్నారు. బీజేపీ నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్, ప్రధాని మోడీ పరిపాలన నడుస్తోంది. 2002 గోద్రా అల్లర్ల అనంతరం బిల్కిస్ బానో కేసులో అత్యాచారం, హత్యకు పాల్పడిన వారిని విడుదల చేయడాన్ని ఓవైసీ ఖండించారు.