విజయ్ దేవరకొండ తో సినిమా ఎప్పటికీ చేయనన్న స్టార్ హీరోయిన్ కారణం..!!

-

రౌడీ హీరో.. ప్రస్తుతం ఎక్కడ చూసినా విజయ్ దేవరకొండ పేరు వినిపిస్తూ ఉండడం గమనార్హం. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన ఇతడు యంగ్ అండ్ సెన్సేషనల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించుకొని ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడుగా పేరు సంపాదించుకున్నారు విజయ్ దేవరకొండ. ఇక అంతే కాదు ఎంతోమంది బాలీవుడ్ హీరోయిన్ లు సైతం విజయ్ దేవరకొండ తమ క్రష్ అని అంటుంటే.. తనతో డేట్ చేయాలని ఉందంటూ కొంతమంది ఓపెన్ అయ్యారు.. ఒక స్టార్ హీరోయిన్ మాత్రం విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చింది.. ఎట్టి పరిస్థితుల్లో కూడా అతనితో సినిమా చేయను అని వెల్లడించింది.

విజయ్ దేవరకొండ సరసన నటించడానికి బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఆసక్తి చూపెడుతుంటే.. మన సౌత్ హీరోయిన్ మాత్రం తనకు అవకాశం వచ్చినా సరే సున్నితంగా ఈ సినిమా అవకాశాన్ని రిజెక్ట్ చేసింది. ఆమె ఎవరో కాదు లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి. మనందరికీ సాయి పల్లవి గురించి బాగా తెలిసిందే.. నచ్చితేనే సినిమాలలో నటిస్తుంది.. అంతే కాదు తనకంటూ ప్రత్యేక పాత్రలు ఉంటేనే ఆమె సినిమాల్లో నటించే అవకాశం ఉంటుంది. అయితే విజయ్ దేవరకొండ సినిమాలలో నటించక పోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. అంతేకాదు ఆమె నేరుగా విజయ్ దేవరకొండ తో కలిసి సినిమాలలో నటించనని తెగేసి చెప్పింది..Sai Pallavi rejected Vijay Devarakonda starrer 'Dear Comrade' due to kissing scene! - We Magazine Simple And Sensibleఅసలు విషయంలోకెళితే .. విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమాలో రష్మిక పాత్ర ముందుగా సాయి పల్లవికి వచ్చింది. ఇందులో ముద్దు సన్నివేశాలు ఉన్నాయన్న ఉద్దేశంతోనే ఆమె ఈ సన్నివేశాన్ని రిజెక్ట్ చేసింది. అంతేకాదు డియర్ కామ్రేడ్ సినిమాను రిజెక్ట్ చేయడమే కాకుండా భవిష్యత్తులో అతడితో సినిమాలు చేయను అని కూడా ఆమె వెల్లడించింది.. విజయ్ సినిమాల ఎంపిక విషయం చాలా భిన్నంగా ఉంటుంది. అందుకే భవిష్యత్తులో అతనితో సినిమాలు చేయడానికి తాను సిద్ధంగా లేను అని కూడా చెప్పింది.ఇక ఈ విషయం పై విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news