రాజీవ్ గాంధీ చరిత్రను అందరూ తెలుసుకోవాలి – జగ్గారెడ్డి

-

భావితరాలు రాజీవ్ గాంధీ చరిత్ర తెలుసుకోవాలని అన్నారు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రాజీవ్ గాంధీ చనిపోయినప్పటి నుండి విహెచ్ గారు ఆయన జయంతి,వర్ధంతి ప్రతి సంవత్సరం జరుపుతూ ఉంటారని అన్నారు. రాజీవ్ గాంధీ గారి త్యాగాలను,దేశం కోసం చేసిన సేవలను విహెచ్ గారు ప్రతి సంవత్సరం భావితరాలకు గుర్తు చేస్తూ ఉంటారని తెలిపారు జగ్గారెడ్డి. గాంధీ,నెహ్రు,ఇందిరా గాంధీ,రాజీవ్ గాంధీ దేశం కోసం చేసిన త్యాగాలను మనమందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

భారత దేశ అభివృద్ధి లో మన భాగస్వామ్యం ఉండేలా కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ దేశం లో అన్ని కులాలు,మతాలు ఒక్కటని నమ్మి ముందుకు వెళ్ళేపార్టీ కాంగ్రెస్ ఒకటేనని అన్నారు. రాజీవ్ గాంధీ చరిత్రను అందరూ తెలుసుకోవాలి.. రాజీవ్ గాంధీ దేశం కోసం బలిదానం అయ్యారని అన్నారు. 18 ఏళ్లకు ఓటు హక్కు తీసుకొచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని..ఈ రోజు ఇన్ని కోట్ల జనాభా ఫోన్స్ ఉపయోగిస్తున్నాయంటే రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీ ని అభివృద్ధి చేయడం వల్లేనని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news