మునుగోడులో టిఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలిందిి. మునుగోడు నియోజకవర్గంలో నేడు జరగనున్న టిఆర్ఎస్ భారీ బహిరంగగ సభకు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ దూరంగా ఉండనున్నారు. అయితే కరోనా సోకడంతోనే ఈ సభకు హాజరు కాలేకపోతున్నానని కర్ణే ప్రభాకర్ ఓ వీడియో రిలీజ్ చేశారు. కానీ కర్నె ప్రభాకర్ మునుగోడు నియోజకవర్గ టికెట్ ఆశిస్తున్నారని.. తనకి అవకాశం దక్కలేదని కారణంతోనే దూరంగా ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 2004 ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున మునుగోడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు కర్ణే ప్రభాకర్.
ఆ తర్వాత 2009లో పొత్తుల కారణంగా పోటీ చేయలేకపోయారు. ఇక 2014 ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆయనకి అవకాశం దక్కలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న కర్నే ప్రభాకర్ ను గతంలో శాసనమండలి సభ్యునిగా నియమించారు. గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీగా నియమించారు. అయితే తాజాగా మునుగోడు టికెట్ ఆశిస్తున్నారని.. అవకాశం దక్కకపోవడంతోనే కేసీఆర్ సభకు దూరంగా ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.