మన సినీ ఇండస్ట్రీలో ఎవరైనా ఏదైనా రికార్డు సృష్టించాలి అంటే ఎవరు చేయని పనిని చేసి చూపించినప్పుడే దానిని రికార్డు అని అంటారు.. ఇక ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి అయితే ఈ రికార్డుల విషయంలో ఎప్పుడు ముందుంటాడని చెప్పాలి.అంతేకాదు ఆయన ఖాతాలో ఎన్ని అరుదైన రికార్డులు ఉంటాయో కూడా చెప్పడం అసాధ్యం. ఒక్క డాన్స్ విషయంలోనే కాదు.. నటన విషయంలో.. సేవా కార్యక్రమాలలో ఇలా ఎన్నో విషయాలలో ఆయన ముందుంటూ ఎంతో ఘనత సాధించారు. ఇకపోతే ఆయన తన సినీ కెరియర్లో సాధించిన రికార్డు..ఏ సినీ ఇండస్ట్రీలోని ఏ హీరో కూడా సాధించలేదు. మరి ఆయన పుట్టినరోజు స్పెషల్ గా ఆయన సాధించిన రికార్డులు ఏమిటో ఇప్పుడు మనం ఒకసారి చదివి తెలుసుకుందాం.1987లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విజయశాంతి, చిరంజీవి హీరో, హీరోయిన్లుగా సుమలత, రఘువరన్, బాబు ఆంటోనీ, సుజిత కీలకపాత్రలో నటించి తెరకెక్కించిన చిత్రం పసివాడి ప్రాణం. ఈ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు. ఇకపోతే ఈ సినిమా విడుదలయి మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా ఈ సినిమాలో చిరంజీవి బ్రేక్ డాన్స్ చేసి చూపించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అప్పటివరకు ఏ హీరో కూడా అలా బ్రేక్ డాన్స్ చేసి రికార్డ్ సృష్టించింది లేదు. అందుకే ఆ ఘనత చిరంజీవికి దక్కింది.అలాగే చిరంజీవి మెగాస్టార్ అవ్వడం వెనక కూడా ఒక రహస్యం ఉంది.. ఎందుకంటే ఈయన నటించిన ఎన్నో చిత్రాలు ఎన్నో కేంద్రాలలో వంద రోజులకు పైగా ఆడి మరొక అరుదైన రికార్డును సృష్టించాయి.. అన్ని సినిమాలు కూడా బ్యాక్ టు బ్యాక్ విజయాన్ని సొంతం చేసుకోవడంతో మెగాస్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు చిరంజీవి. ఈయన సినిమాలు మంచి సక్సెస్ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను కూడా రాబట్టి మరొక అరుదైన రికార్డును సృష్టించాయి. ఇక ఇవన్నీ కూడా చిరంజీవి ఖాతాలోనే అరుదైన రికార్డులుగా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం.