కేరళలో వింత ఘటన చోటు చేసుకుంది. అంత్యక్రియల సమయంలో దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోటోలో కుటుంబసభ్యులు చనిపోయిన బామ్మ శవపేటిక దగ్గర కుటుంబసభ్యులు నిల్చుని నవ్వుతూ ఫోటోలకు ఫోజిచ్చారు. అయితే నవ్వుతూ ఫోటోకు స్టిల్ ఇవ్వడానికి గల కారణం తెలిస్తే మీరూ ఆశ్చర్యపోతారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన మరియమ్మ (95 ఏళ్లు). గతేడాది నుంచి అనారోగ్యంతో బాధ పడుతూ వచ్చింది. అయితే వారం రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది. దీంతో శుక్రవారం ఉదయం బామ్మ మృతి చెందింది. అయితే బామ్మకు తొమ్మిది మంది పిల్లలు. 19 మంది మనుమలు, ముని మనుమలు, మనవరాళ్లు ఉన్నారు. వీరంతా విదేశాల్లో ఉంటారు.
మరియమ్మ చనిపోవడంతో వీరంతా ఇంటికి వచ్చారు. అయితే మరియమ్మ అంటే కుటుంబంలో అందరికీ ఇష్టం. 95 ఏళ్లు సంపూర్ణ జీవితాన్ని గడిపిందని, అందుకే ఆమె అంత్యక్రియలను విషాదం చేసుకోకూడదనుకున్నారు. నవ్వుతూ వీడ్కోలు పలికినట్లు కుటుంబంలోని ఒక బంధువు తెలిపారు. ఈ క్రమంలో కుటుంబసభ్యులందరూ కలిసి ఫోటో దిగినట్లు ఆయన వెల్లడించారు.