ఏపీలో పార్లే ఫ్యూచర్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు..20 వేల మందికి ఉద్యోగాలు

-

త్వరలోనే రీసైక్లింగ్, అప్‌ సైక్లింగ్‌ హబ్‌ లు ఏర్పాటు కానున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. దీని కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 20 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు. ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు విశాఖలో పర్యటిస్తున్నారు. ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి బీచ్ వరకు 25వేల మందితో 25 కిలోమీటర్ల మెగా క్లీనప్ డ్రైవ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏయూ కన్వెన్షన్ సెంటర్ లో సీఎం జగన్ మాట్లాడుతూ.. సముద్ర గర్భంలో కూడా ప్లాస్టిక్‌ కనిపిస్తున్న పరిస్థితి ఉందని… వీటికి పరిష్కారం కోసం ఏపీ అడుగులు ముందుకేస్తోందన్నారు.

cm jagan
cm jagan

ఇందులో భాగంగా 2 కంపెనీలను రాష్ట ప్రభుత్వం భాగస్వాములుగా తీసుకుందని.. ఒకటి జీఏఎస్‌పీ కాగా, పార్లే రెండో కంపెనీ అని వివరించారు. భాగస్వాములను గుర్తించండం, కొత్త ఆలోచనలు తీసుకురావడం, ఆర్థిక వనరులను సమకూర్చడంలో జీఏఎస్‌పీ కీలకంగా వ్యవహరిస్తుందని.. రీసైక్లిడ్‌ ప్లాస్టిక్‌ నుంచి బూట్లు తయారవుతున్నాయని చెప్పారు.

అడిడాస్‌ కంపెనీ వీటిని తయారు చేస్తోందని… బ్యాగుల దగ్గర నుంచి కంటి అద్దాల వరకూ కూడా ప్లాస్టిక్‌ వ్యర్థాలనుంచి తయారు చేస్తున్నారన్నారు.పార్లేకు ప్రపంచంలోనే ప్రఖ్యాత కంపెనీలు బెంజ్, ఆడిడాస్, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌లతో వ్యాపారం ఉందని.. వారికి కావాల్సిన ఉత్పత్తులు తయారు చేస్తోందని వివరించారు. రాబోయే రోజుల్లో ఏపీ ముఖచిత్రాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నామని ప్రకటించారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news