అలెర్ట్: సెప్టెంబర్ లో కొత్త రూల్స్.. వివరాలివే..!

-

ప్రతీ నెలా కూడా కొత్త రూల్స్ ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. ఈ నెలలో కూడా కొన్ని కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. అయితే మరి సెప్టెంబర్ నెలలో మారనున్న అంశాలు ఏమిటో చూద్దాం. పూర్తి వివరాల లోకి వెళితే.. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు మొదలు కొన్ని అంశాలలో మార్పులు వచ్చాయి. వాటిని జాగ్రత్తగా గమనించండి.

గ్యాస్ సిలిండర్ ధరలు:

ప్రతీ నెల మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ ధరల్ని ఆయిల్ కంపెనీలు మారుస్తూ ఉంటాయి. అయితే మరి ఈ నెల గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా వుంటాయో చూడాలి.

ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా:

ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త రూల్ ని తీసుకొచ్చింది. ఇన్స్యూరెన్స్ ఏజెంట్లకు మొదట సంవత్సరం కమిషన్‌, ఇన్సెంటీవ్‌ను 20 శాతానికి లిమిట్ చేసింది.
సెప్టెంబర్‌ లోనే ఇవి అమలవచ్చు.

పీఎం కిసాన్:

త్వరలో 12వ ఇన్‌స్టాల్‌మెంట్ విడుదల అవ్వనుంది. కనుక ఇకేవైసీ పూర్తి చేయాలి. సెప్టెంబర్ 1 నుంచి ఇకేవైసీ పూర్తి చెయ్యచ్చు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్:

బ్యాంకులకు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ కి సంబంధించి రూల్స్ ని మార్చగా … బ్యాంకులు ఆర్‌బీఐని మరింత గడువు కోరడంతో సెప్టెంబర్ 30 వరకు వెసులుబాటు ఇచ్చింది. అక్టోబర్ 1 నుండి ఈ రూల్స్ అమలు లోకి వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news