50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చందమామపైకి మళ్లీ మనిషిని పంపే బృహత్తర కార్యక్రమానికి ఆటంకాలు ఎదురయ్యాయి. ఆర్టెమిస్-1 పేరుతో అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహిస్తున్న ఈ యాత్రలో అత్యంత శక్తిమంతమైన రాకెట్, వ్యోమనౌకలు నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉండగా.. ఇంధన ట్యాంకర్లో లీకేజీల కారణంగా పలుమార్లు అవాంతరాలు ఏర్పడ్డాయి. వీటిని పరిష్కరిస్తూ ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు నాసా తొలుత ప్రకటించింది.
అయితే, చివరికి రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. సోమవారం ప్రయోగం నిర్వహించడం లేదని స్పష్టం చేసింది. తదుపరి తేదీపై త్వరలోనే స్పష్టత ఇస్తామని వివరించింది.ఫ్లోరిడాలోని నాసా కెనెడీ అంతరిక్ష కేంద్రంలో ఇప్పటికే లాంచ్‌పాడ్‌పై రాకెట్‌ను ఉంచారు. శనివారం లాంచ్‌పాడ్‌ను ఐదు పిడుగులు తాకినా రాకెట్‌కుగాని, ఓరియన్ క్యాప్సూల్‌కుగాని ఎలాంటి నష్టం జరగలేదు. అయితే, రాకెట్ ప్రయోగానికి గంటల ముందు లాంఛ్ సిస్టమ్ రాకెట్లో ఇంధనం లీక్ అయినట్లు సమాచారం.
సూపర్ కోల్డ్ హైడ్రోజన్, ఆక్సిజన్ లీక్ అవ్వడం వల్ల ప్రయోగాన్ని వాయిదా వేశారు. పిడుగల కారణంగా నిర్దేశించిన సమయం కంటే ఇంధన సరఫరా గంట ఆలస్యంగా నడిచింది. అనంతరం, రిహార్సల్స్ నిర్వహించగా ఆ సమయంలోనే ఇంధన లీకేజీ జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వాల్వ్లోనూ లీకేజీలు ఏర్పడ్డాయి. ఉదయం, నాలుగు ప్రధాన ఇంజిన్లు, పెద్ద ఇంధన ట్యాంకు ఉన్న ప్రాంతంలో పగుళ్లు లేదా లోపాలు గుర్తించినట్లు నాసా అధికారులు వెల్లడించారు.
The launch of #Artemis I is no longer happening today as teams work through an issue with an engine bleed. Teams will continue to gather data, and we will keep you posted on the timing of the next launch attempt. https://t.co/tQ0lp6Ruhv pic.twitter.com/u6Uiim2mom
— NASA (@NASA) August 29, 2022