తెలుగు హీరోలకు అసలు తెలుగు రాదు.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

టాలీవుడ్ ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాల్లో తెలుగు భాష పరిస్థితి దిగజారిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పాన్ ఇండియా మోజులో పడి, మన తెలుగును పూర్తిగా కొందరు విస్మరిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు హీరోలకు కొందరికి తెలుగు రావడం లేదని అన్నారు.

తెలుగు రాని వారి చేత తెలుగు పాటలు పాడిస్తు్న్నారని, కొంత మంది సంగీత దర్శకులకు తెలుగు రాకపోవడం వలన అసలు తెలుగు భాషా సౌందర్యం తెలియడం లేదని అభిప్రాయపడ్డారు. నటీ నటులకు తెలుగు రావడం లేదని పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కల్యాణ్, బాలకృష్ణ వంటి వారు మాత్రమే తమ చిత్ర ఈవెంట్స్ లో తెలుగులో మాట్లాడుతున్నారని వివరించారు. ఈ హీరోలు మినహా మిగతా వారు తెలుగులో ఎందుకు మాట్లాడటం లేదని తమ్మారెడ్డి ప్రశ్నించారు.

తెలుగు హీరోలు కొందరికి అసలు తెలుగు రావడం లేదని, వారు ఇంగ్లిష్ లో ఈవెంట్స్ లో మాట్లాడుతున్నారని, అది సరికాదని అన్నారు. పర భాషా నటులు సిద్ధార్థ్, ప్రకాశ్ రాజ్ తెలుగు నేర్చుకుని మాట్లాడుతుంటే మనవాళ్లు తెలుగు మాట్లాడటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వేరే భాషాల నటీ నటులు తెలుగు భాషను చక్కగా అర్థం చేసుకుని మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటే, మనవాళ్లు భాషను మరిచిపోతున్నారని వివరించారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషను కాపాడుకునేందుకు ప్రతీ ఒక్కరు ప్రయత్నించాలని ఆయన ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news