ఇంగ్లీష్‌ గడ్డపై..తెలుగు గురించి మాట్లాడటం గర్వంగా ఉంది – వెంకయ్యనాయుడు

-

తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ వారి కార్యక్రమంలో వెంకయ్యనాయుడు ప్రసంగించారు. బానిసలుగా చూసిన దేశపు నేలమీద నిలబడి మాతృభాష గొప్పతనాన్ని చాటుకోవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. భాషా సంస్కృతులను కాపాడుకునే దిశగా “తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్” చేస్తున్న కృషి అభినందనీయమైనదని.. మాతృభాష తరతరాలకు మరింత చేరువ కావాలని గిడుగు ఆకాంక్షించారని తెలిపారు.

గిడుగు వారి స్ఫూర్తితో మన భాషా సంస్కృతుల పరిరక్షణకు యువత నడుం బిగించాలి… భాషా సంస్కృతులే భవిష్యత్తులో మన చిరునామాను తెలియజేస్తాయని, అలాంటి భాషను, సంస్కృతిని కాపాడుకోవడమే తెలుగు భాషా దినోత్సవ సంకల్పం కావాలని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ఆయన, తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని “తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్” సాంస్కృతిక సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు.

భారతదేశం స్వరాజ్యం సంపాదించుకున్న 75 ఏళ్ళలో విదేశాల సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థల్లో భారతీయులు భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, ముఖ్యంగా భారతీయులను బానిసలుగా చూసిన బ్రిటీష్ గడ్డ మీద భారతీయులకు ఈ రోజు అందుతున్న గౌరవం చూస్తుంటే గర్వంగా ఉందని తెలిపారు. “వసుధైవ కుటుంబకం” భావనను బలంగా నమ్మిన భారతీయులు సనాతన కాలం నుంచి కోరుకున్న నిజమైన పురోభివృద్ధి ఇదేనని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news