” నేను మీకు బాగా కావాల్సినవాడిని” మూవీ నుండి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

-

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ఈ మధ్యకాలంలో ఎంతోమంది కుర్రాళ్ళు హీరోగా పరిచయం అవుతున్నారు. అయితే అందులో కొందరు మాత్రమే మొదటి చిత్రంతోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. తద్వారా గ్రాండ్ ఎంట్రీ ని అందుకుంటున్నారు. అలా టాలీవుడ్ లో హైలైట్ అయిన కుర్రాలలో రాయలసీమ చిన్నోడు కిరణ్ అబ్బవరం ఒకడు. “రాజావారు రాణిగారు” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం…. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.

రాజావారు రాణి గారు సినిమా తర్వాత “ఎస్ ఆర్ కళ్యాణ మండపం” సినిమా చేసాడు. తాజాగా సమ్మెతమేతో టాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించాడు. ఇక లెటెస్ట్‌ గా “నేను మీకు బాగా కావాల్సిన వాడిని” అంటూ డిఫరెంట్ టైటిల్తో వచ్చేసాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమా శ్రీధర్ గాదే దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తిరగకుతున్న ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం కు జోడిగా సంజన ఆనంద్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. కోడి రామకృష్ణ సమర్పణలో కోడి దివ్య దీప్తి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ఆఫీషియల్ టీజర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ సినిమా నుండి ఒక లిరికల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేసింది చిత్రం బృందం. ” అట్టాంటి ఇట్టాంటి దాన్ని కాదు మావో” అంటూ సాగే ఈ మాస్ బీట్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ పాటకి శ్యాము కాసర్ల సాహిత్యాన్ని అందించారు. సాకేత్- కీర్తన ఆలపించగా.. భాను కొరియోగ్రఫీని అందించాడు.

Read more RELATED
Recommended to you

Latest news