వచ్చే నెల 11 నుంచి కొత్త గురుకులాల ప్రారంభం

-

రాష్ట్రంలో మరో 33 బీసీ గురుకుల పాఠశాలల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. అక్టోబరు 11 నుంచి, 15 బీసీ డిగ్రీ గురుకుల కళాశాలల్ని అదే నెల 15వ తేదీ నుంచి ప్రారంభించాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఆదేశించారు. మంత్రి శుక్రవారం సమీక్ష నిర్వహించారు.

‘గురుకులాలకు స్థలాల గుర్తింపులో మంత్రులు, ఎమ్మెల్యేలతో అధికారులు సమన్వయం చేసుకోవాలి. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు హాలియా, దేవరకద్ర, కరీంనగర్‌, సిరిసిల్ల, వనపర్తితో పాటు పాతజిల్లాల ప్రాతిపదికన అన్ని జిల్లాల్లో డిగ్రీ కళాశాలలు మంజూరయ్యాయి. కొత్తగా మంజూరైన వాటితో కలిపి రాష్ట్రంలో బీసీ గురుకులాల సంఖ్య 310కి చేరింది. కొత్తగా ఏకసంఘంగా ఏర్పాటవుతున్న కులసంఘాల ఆత్మగౌరవ భవనాలకు ఈ నెల 8న పట్టాలివ్వనున్నాం. ప్రభుత్వోద్యోగాలకు శిక్షణ కోసం మరో 50 స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలి. వీటి ద్వారా 25 వేల మందికి శిక్షణ ఇవ్వాలి’ అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news