RSS బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా వ్యవహరించింది – చాడా వెంకట్ రెడ్డి

-

ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా వ్యవహరించిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. ఇప్పుడు గొప్పలు చెబుతున్న మోడీ పార్టీ అప్పుడు లేనే లేదన్నారు. కమ్యూనిస్టులు స్వతంత్ర పోరాటంలో ఎన్నో త్యాగాలు చేశారని అన్నారు. స్వతంత్ర పోరాటంలో లేనివాళ్లే ఎక్కువ మాట్లాడుతున్నారనిి మండిపడ్డారు. మోడీ అధికారంలోకి వచ్చినప్పటినుండి ప్రజాస్వామ్యం ఖుూనీ అయిందని ఆరోపించారు. బిజెపి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుందన్నారు.

9 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చి.. తెలంగాణలో కూడా బిజెపి పాగా వేసేందుకు కుట్రలు చేస్తోందన్నారు. నిర్మల సీతారామన్ రేషన్ షాపులో మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని అడుగుతోందని.. మరి ఇంత దిగజారి ప్రవర్తిస్తోందని అన్నారు. తెలంగాణలో బిజెపి సాయుధ పోరాటాన్ని కూడా వక్రీకరిస్తోందని అన్నారు చాడ వెంకటరెడ్డి. తెలంగాణలో బిజెపి అబద్ధాల ప్రచారం చేస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news