బెల్లం, పుట్నాల పప్పు కలిపి తినేస్తున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!!

-

బెల్లం, పంచాదార రెండు తియ్యగా ఉండే పదార్థాలే అయినా..వీటి గుణాల్లో తేడాలు చాలా ఉన్నాయి. పంచదార వాడకం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.. అదే బెల్లం అయితే ఎంత తిన్నా ఎలాంటి సమస్యలు రావు. ఇంకా బెల్లం డైలీ తినడం వల్ల రక్తహీనత సమస్య పోతుంది. మలబద్ధకం ఉండదు. రోజు భోజనం అయ్యాక చిన్న బెల్లం ముక్క తింటే..త్వరగా జీర్ణం అవుతుంది. ఇలా బెల్లం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.. చాలామందికి బెల్లం, పుట్నాలు కలిపి తినే అలవాటు ఉంటుంది. ఇది మనం చిన్నప్పుడు సరుకులు తీసుకున్నప్పుడు షాపువాళ్లు ఫ్రీగా ఇచ్చే వాళ్లు..ఇప్పుడు అన్నీ మాల్స్‌ వచ్చాకా ఇలా అస్సలు ఎవరూ ఇవ్వడం లేదు. అసలు బెల్లం, పుట్నాలు కలిపి తినొచ్చా.. టేస్ట్‌ బానే ఉంటాయ్‌లే కానీ ఇంకా వాటి వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా..?

ప్రోటీన్స్‌ను అధికంగా క‌లిగిన ఆహార ప‌దార్థాల‌లో పుట్నాల ప‌ప్పు ఒక‌టి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్లు అందుతాయ. పుట్నాల ప‌ప్పును ఉప‌యోగించి ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తారు. పుట్నాల ప‌ప్పుతో చేసే కారం పొడి చాలా రుచిగా ఉంటుంది. పుట్నాల కారాన్ని మ‌నం అన్నం, దోశ‌, ఉప్మా వంటి వాటితో క‌లిపి తింటూ ఉంటాం. వివిధ ర‌కాల కూర‌గాయ‌ల వేపుడుల‌ను చేసేట‌ప్పుడు వాటిలో పుట్నాల‌ను కానీ వాటితో చేసిన కారాన్ని కానీ వేయడం మహిళలకు అలవాటు..

పుట్నాల ప‌ప్పును శ‌న‌గ‌ల నుండి త‌యారు చేస్తారు. వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. జీర్ణాశ‌య సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. బ‌రువు తగ్గ‌డంలో కూడా పుట్నాలు బాగా హెల్ప్‌ అవుతాయి. పుట్నాల ప‌ప్పును బెల్లంతో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. చ‌ర్మంపై ఉండే ముడ‌త‌ల‌ను తొల‌గించే సామ‌ర్థ్యం పుట్నాల ప‌ప్పుకు ఉందని నిపుణులు అంటున్నారు.

ఈరోజుల్లో చాలామందికి కామన్‌గా ఉండే సమస్య జుట్టురాలడం. బెల్లం, పుట్నాలు కలిపి డైలీ తినడం వల్ల జుట్టు రాలడం తగ్గి, జుట్టు ఆరోగ్యంగా అవుతుందట. పుట్నాల ప‌ప్పుతో మ‌నం ల‌డ్డూల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఇలా త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల స్త్రీల‌లో నెల‌స‌రి స‌మ‌స్య‌లు తగ్గుతాయ‌ని, గ‌ర్భిణులు కూడా పుట్నాల లడ్డూల‌ను తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చని.. నిపుణులు చెబుతున్నారు.

అయితే బెల్లాన్ని ఎంచుకునేప్పుడు చాలా నాణ్యమైనది తీసుకోవాలి. సాధారణంగానే బెల్లం తయారు చేసేప్పుడు పెద్దగా పరిశుభ్రత పాటించరు. కాబట్టి.కాస్త ఖరీదైనా పర్వాలేదు.. మంచి బెల్లం తీసుకుని తింటే ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా ఉంటాయి.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news