నెలసరి ముందు బ్రస్ట్‌ పెయిన్‌ వస్తుందా..? ఇది దేనికి సంకేతం..?

-

మహిళలకు నెల నెల వచ్చే పిరియడ్స్‌ కొందరికి ఎప్పుడు వచ్చాయో కూడా తెలియకుండా ఉంటే.. మరికొందరికి డేట్‌ టైం దగ్గరపడుతుందంటేనే వణుకు పుడుతుంది. నరకం అనుభవిస్తారు. మహిళ ఆరోగ్యానికి పిరియడ్స్‌కు చాలా దగ్గరి సంబంధం ఉంది. నెల నెల నెలసరి రాకపోయినా, బ్లీడింగ్‌ సరిగ్గా కాకపోయినా, విపరీతమైన నొప్పి ఉన్నా ఆరోగ్యం బాలేదన్నట్లే.. సాధారణంగా వచ్చే నొప్పి అయితే లైట్‌ తీసుకోవచ్చు. కానీ కొంతమందికి నెలసరి ముందు బ్రస్ట్‌ పెయిన్‌ వస్తుంది. ఈ పెయిన్‌ ప్రతిసారీ ఉంటే రొమ్ములు పుండ్లు పడే అవకాశం ఉందంటున్నారు వైద్యులు.. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది ? ఏం చేయాలో చూద్దాం!

ఎందుకంటే…

పీరియడ్స్ వచ్చే ముందు రొమ్ముల్లో కాస్త నొప్పి రావడం సహజమేనని చెప్పారు. పీరియడ్స్ వస్తున్నాయంటే మహిళ శరీరం బిడ్డను కనేందుకు సిద్ధంగా ఉందని అర్థం. అందుకే పీరియడ్స్ ముందు రొమ్ముల్లో పాలు ఉత్పత్తి చేసే గ్రంధులు పనిచేయడం మొదలుపెడతాయట.. దీని వల్ల కాస్త సున్నితంగా, నొప్పిగా అనిపిస్తాయి. ప్రొసెస్టరాన్ హార్మోను రుతుచక్రం, గర్భం, పిండ ఉత్పత్తిలో పాల్గొనే సెక్స్ హార్మోను. రొమ్ములు సైజు పెరగడం కూడా జరుగుతుంది. రొమ్ములు బరువుగా మారడం, నొప్పులు రావడం వంటివి జరుగుతాయి. ప్రతి నెలా వచ్చే నొప్పి మీకు తెలుస్తుంది. అలా కాకుండా నొప్పిలో మార్పు వస్తే, అంటే తీవ్రంగా మారినా లేక చనుమొనల నుంచి స్రావాల్లాంటివి డిశ్చార్జ్ అవుతున్నా, రొమ్ముల్లో ఏదైనా గడ్డ ఉన్నట్టు అనిపిస్తున్నా ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించండి.. ఇవి రొమ్ము క్యాన్సర్‌ను సూచిస్తాయి.

ఇలా చేయండి…

ద్రవ పదార్థాలు తీసుకోవాలి. నీళ్లు, కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు తాగుతూ ఉండాలి. ఇవి పొత్తి కడుపు ఉబ్బరాన్ని తగ్గించేందుకు సహాయపడతాయి.
ఈ సమయంలో సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను అధికంగా తీసుకోవాలి.
ఉప్పు, చక్కెర, ఆల్కహాల్,కెఫీన్ వంటి వాటికి దూరంగా ఉండాలి.
కంటి నిండా నిద్రపోవాలి. నిద్ర తగ్గినా ప్రభావం పడుతుంది. రోజుకు తొమ్మిది గంటల నిద్ర అవసరం.
రోజూ అరగంట పాటూ వ్యాయామం చేయాలి. దీని వల్ల చాలా సమస్యలు తగ్గుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news