తులసి కోట దగ్గర ఇలాంటి పొరపాట్లు చేస్తే చిక్కులే..!

-

ప్రతి రోజు హిందువులు తులసి మొక్కను పూజిస్తూ ఉంటారు. పూర్వ కాలం నుండి కూడా తులసి మొక్కని పరమ పవిత్రంగా భావించి పూజించడం జరుగుతుంది. అంతే కాకుండా తులసిని ఆయుర్వేద వైద్యం లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. తులసి మొక్కని లక్ష్మీదేవికి ప్రతి రూపంగా భావించి హిందువులు పూజిస్తారు అందుకనే తులసి మొక్క కి సంబంధించి పొరపాట్లు జరగకూడదు లేదంటే అనవసరంగా లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

తెలిసో తెలియకో కొంత మంది తప్పులు చేస్తూ ఉంటారు అటువంటి తప్పులకు దూరంగా ఉండడం మంచిది. తులసి మొక్కను పూజించి పరమ పవిత్రంగా భావించాలి. అంతేకానీ ఈ చిన్నచిన్న పొరపాట్లను అస్సలు చేయకూడదు. తులసి మొక్క ముందు శుభ్రంగా ఉంచాలి. చెత్తాచెదారం సమీపంలో ఉండకూడదు. అలాగే తులసి మొక్క దగ్గర చెప్పులు బూట్లు వంటవి పెట్టకూడదు ఇటువంటివి పెట్టడం వల్ల కూడా లక్ష్మీదేవికి కోపం వస్తుంది.

తులసి మొక్క దగ్గర బకెట్లతో నింపిన నీళ్లు ఉండకూడదు. అదే విధంగా తులసి మొక్క ఎండిపోకుండా చూసుకోవడం కూడా చాలా అవసరం. చాలా మంది తులసి మొక్కను సరిగ్గా పెంచరు. మొక్క ఎండిపోతూ ఉంటుంది ఈ తప్పు కూడా జరగకూడదు. ఇలాంటి తప్పులు లేకుండా చూసుకోండి లేదంటే అనవసరంగా మీరే చిక్కుల్లోపడతారు.

Read more RELATED
Recommended to you

Latest news