ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరిపై బీజేపీ వేటు !

-

ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరిపై బీజేపీ వేటు వేసింది. పురందేశ్వరి వ్యవహర శైలి పట్ల తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్న బిజేపి అగ్రనాయకత్వం… గతనెలలో ఒరిస్సా బాధ్యతలు, నిన్న ఛత్తీస్ ఘడ్ బిజేపి ఇంచార్జ్ బాధ్యతల నుంచి పురందేశ్వరిని తప్పించింది. పురందేశ్వరి అధ్యక్షతన “ఏపిలో విస్తృత చేరికల కమిటీ” ఏర్పాటు చేసినా ఏమాత్రం ఫలితం లేదనే అభిప్రాయంలో ఉన్న బిజేపి అగ్రనాయకత్వం… ఎన్.టి.ఆర్ కుమార్తెగా బిజేపి లో ఎవరికీ ఇవ్వని రీతిలో ప్రాధాన్యం ఇచ్చినా ప్రయోజనం ఏమీ లేదనే అభిప్రాయంలో ఉంది.

పురందేశ్వరికి బిజేపిలో మంచి గౌరవం ఇచ్చినా, చేరికల విషయంలో ఏమాత్రం ప్రయత్నాలు చేయలేదని
గ్రహించిన బిజేపి అగ్రనాయకత్వం… అమిత్ షా తో సహా, బిజేపి పెద్దలు పలుమార్లు చెప్పినా, ఒక్క సారి కూడా “విస్తృత చేరికల కమిటీ” సమావేశాన్ని నిర్వహించకపోవడం బిజేపి అగ్రనాయకత్వానికి ఆగ్రహం కలిగించడానికి బలమైన కారణమని చెపుతున్నాయి పార్టీ వర్గాలు.

ఎన్.టి.ఆర్ కుమార్తె గా పురందేశ్వరి ద్వారా పెద్ద ఎత్తున టిడిపి నుంచి బిజేపి లో చేరికలు ఉంటాయని ఆశించిన పార్టీ నాయకత్వం… కానీ చేరికల విషయంలో పురందేశ్వరి ఏ మాత్రం ప్రయత్నాలు చేయలేదని అభిప్రాయానికి వచ్చింది. దీంతో ఆమెపై వేటు వేశారని తెలుస్తోంది. అంతేకాదు.. త్వరలోనే పురందేశ్వరి.. టీడీపీలోకి వెళతారని జోరుగా ప్రచారం జరుగుతుండటంతో.. ఆమెపై వేటు పడ్డట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news