ఈమె డేడికేషన్ కు ఎవరైనా హ్యట్సాప్ అనాల్సిందే..వీడియో వైరల్..

-

అన్ని బాగున్న వాళ్ళు ఎటువంటి పని చెయ్యకుండా సోమరిగా ఉండటం చూస్తూనే ఉంటాము..కానీ దివ్యాంగులు మాత్రం ఒకరిచేత అనిపించుకునే విధంగా కాకుండా శభాష్ అనే విధంగా ఉంటారు..వారికి ఉన్న లోపాన్ని పక్కన పెట్టి మరీ అనుకున్నదాన్ని సాధిస్తారు.చాలామంది చిన్నచూపు చూస్తుంటారు. జీవితంలో వారింకా సాధించలేరని తేలికగా తీసి పారేస్తుంటారు.

అయితే ఈ ఆలోచన తప్పని చాలాసార్లు నిరూపితమైంది. సంకల్పం, పట్టుదల ఉంటే ఎలాంటి అవరోధాలనైనా అధిగమించవచ్చని చాలామంది దివ్యాంగులు నిరూపించారు. నిరూపిస్తూనే ఉన్నారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడ నెట్టింట్లో దర్శనమిస్తుంటాయి. అవి చూడడానికి ఎంతో స్ఫూర్తిని కలిగిస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. దివ్యాంగురాలైన ఓ యువతి వీల్ చైర్ లో కూర్చోని ఆన్ లైన్ ఫుడ్ ను డెలివరీ చేస్తుంది.

ఆ యువతి ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఏజెంట్ అని తెలుస్తోంది. అలాగే వీపుపై స్విగ్గీ బ్యాగ్‌ను కూడా మనం చూడవచ్చు. ఆమె ఎక్కడ పనిచేస్తుందో తెలియదు కానీ ఆమె తపనను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వీల్‌చైర్‌ను బైక్‌గా మార్చుకుని కస్టమర్లకు ఫుడ్‌ డెలివరీ చేస్తున్న విధానాన్ని చూసి హ్యాట్సాఫ్ అంటున్నారు. నేటి తరం యువతకు ఆమె ఆదర్శమంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు షేర్‌ చేస్తున్నారు… నెటిజన్లను తెగ ఆకర్షిస్తుంది.ఈ వీడియోకు 2 లక్షలకు పైగా వ్యూస్‌ రావడం విశేషం. అలాగే 10వేల మందికి పైగా లైకులు కొట్టారు..ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ఎంత బాగుండో.. మన దేశంలో నిరుద్యోగ సమస్య తగ్గుతుంది..ఆర్థికంగా అభివృద్ధి చెందుతోంది.. నిజంగా గ్రేట్..

Read more RELATED
Recommended to you

Latest news