లక్ష్మీస్ ఎన్టీఆర్ తో రాకేష్ రెడ్డి నిర్మాతగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే రాకేష్ రెడ్డి టాలీవుడ్ లో బాగా ఫేమస్ అయ్యాడు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టార్గెట్ గా తెరకెక్కించడంతోనే ఆక్రెడిట్ దక్కింది. సినిమా తెలంగాణ లోనే విడుదలైన మంచి లాభాలు వచ్చాయి. దీంతో నయా నిర్మాత రెండవ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈసారి కూల్ గా ఎలాంటి వివాదం లేకుండా లవ్ స్టోరీతో రాబోతున్నాడు. అలాగని ఆషామాషీ లవ్ స్టోరీ అనుకుంటున్నారా? కాదు. అర్జున్ రెడ్డిని మించిన కథ అంటూ ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఈ కథకు చిన్ని కృష్ణ రచన చేస్తున్నాడని అంచనాలను ఒక్కసారిగా తల్లకిందులు చేసేసాడు. చిన్నికృష్ణ ఔడెటెడ్. ఆయన కథలకి ఇప్పుడు అభిమానులు లేరు.
అప్పట్లో రాయలసీమకు ఫ్యాక్షన్ కథలు అందించాడు. వాటికిప్పుడు కాలం చెల్లిపోయింది. తర్వాత చాలా మంది కొత్త రైటర్లు రావడంతో చిన్నికృష్ణకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇప్పుడాయన బ్రెయిన్ అంత షార్ప్ గా ఉంటుందా? అన్న దాంట్లోని గ్యారెంటీ లేదు. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి ప్రచారం లోనిలుస్తున్నాడు తప్ప….అతనిలో ట్యాలెంట్ లేదని ఇండస్ర్టీ ఎప్పుడో డిసైడ్ అయింది. కనీసం చిన్న స్థాయి నిర్మాతలకు అతనికి అవకాశాలివ్వడం లేదు. ఇప్పుడాయన రచనలో రాకేష్ రెడ్డి సినిమా చేయడంమే పెద్ద కామెడీగా ఉందని క్రిటిక్ వర్గం భావిస్తోంది. కె.ఎల్ యూనివర్సీ వ్యవస్థాపకుడు మనవడు హవీష్ ను హీరోగా చేస్తానని జీనియస్ కు కథ అందించాడు. ఆ కథే పరమ రొటీన్ గా ఉంటుంది. ఆ సినిమా ఫలితం తర్వాత హవీష్ చిన్ని కృష్ణను దగ్గరకు కూడా రానివ్వలేదు.
ఇప్పుడు రాకేష్ రెడ్డి వెళ్లాడంటే? ఇద్దరూ ఏదో పొలిటికల్ గేమ్ ప్లాన్ చేసారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాకేష్ రెడ్డి వస్తూనే చంద్రబాబుని టార్గెట్ చేసాడు. ఇక చిన్ని కృష్ణ మెగా ఫ్యామిలీకి విరోధి అయ్యాడు. అవకాశాలిచ్చి ప్రోత్సహించిన ఆ ఫ్యామిలీపైనే నిందలు వేసాడు. ఇవన్నీ కేవలం వ్యక్తిగతంగా చేసినవేనని అప్పట్లో టాలీవుడ్ మీడియాలో జో్రుగా ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో లవ్ స్టోరీ అంటున్నాడు. దీంతో మెగా ఫ్యామిలీని ఉద్దేశించి ఏదైనా వివాదాస్పద పాయింట్ ను టచ్ చేయబోతున్నాడా? అన్న అనుమానాలు కొందరిలో కలుగుతున్నాయి.