ఇండోనేషియాలో వింత జీవి.. దాన్ని చూసి జనాలు షాక్.. వీడియో

-

జంతుశాస్త్ర నిపుణులు ఏమంటున్నారంటే.. అది ఆర్కిటినే జాతికి చెందిన కీటకమని చెబుతున్నారు. ఆగ్నేయ ఆసియా, ఆస్ట్రేలియాల్లో మాత్రమే ఈ కీటకం కనిపిస్తుందని.. ఇండోనేషియాకు ఎలా వచ్చిందో కనిపెట్టాల్సి ఉందని వాళ్లు చెబుతున్నారు.

ఇండోనేషియాలో ఓ వింత జీవి దర్శనిమిచ్చింది. బాలిలో ఏలియన్‌లా ఉన్న ఆ వింత జీవి కనిపించింది. ఓ ఇంట్లో సీలింగ్‌కు అతుక్కొని ఆ వింత జీవి ఉండటంతో దాన్ని చూసిన ఇంటి వ్యక్తులు భయపడిపోయారు. అది అచ్చం అలొవెరా మొక్కలా ఉంది.

దానికి రెండు రెక్కలు కూడా ఉన్నాయి. ఏనుగు తొండాల్లా నాలుగు తోకలు దాని ఉన్నాయి. ఈ వింత జీవి గురించి వెంటనే ఆ ఇంటి యజమాని యానిమల్ రెస్క్యూ టీంకు సమాచారం అందించగా.. వాళ్లు వచ్చి దాన్ని బంధించి తీసుకెళ్లారు.

జంతుశాస్త్ర నిపుణులు ఏమంటున్నారంటే.. అది ఆర్కిటినే జాతికి చెందిన కీటకమని చెబుతున్నారు. ఆగ్నేయ ఆసియా, ఆస్ట్రేలియాల్లో మాత్రమే ఈ కీటకం కనిపిస్తుందని.. ఇండోనేషియాకు ఎలా వచ్చిందో కనిపెట్టాల్సి ఉందని వాళ్లు చెబుతున్నారు. మొత్తానికి ఈ వింత జంతువు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news