ఎక్కువ ట్రైన్ టికెట్స్ బుక్ చెయ్యాలంటే.. ఐఆర్‌సీటీసీ అకౌంట్‌కు ఆధార్ ని ఇలా ఈజీగా లింక్ చేసుకోవచ్చు..!

-

ఐఆర్‌సీటీసీ టూర్స్ మొదలు ఎన్నో సర్వీసులను అందిస్తోంది. వాటిలో టికెట్ బుకింగ్ కూడా ఒకటి. గతంలో ఐఆర్‌సీటీసీలో నెలకు 6 రైలు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉండేది. ఐఆర్‌సీటీసీ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేస్తే 12 రైలు టికెట్లను బుక్ చెయ్యచ్చు.

IRCTC
IRCTC

కానీ ఇప్పుడు మాత్రం దానిని మార్చేశారు. ఇక పూర్తి వివరాలను చూస్తే.. ఐఆర్‌సీటీసీ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయకపోతే 12 రైలు టికెట్లు బుక్ చెయ్యచ్చు అదే ఆధార్ లింక్ చేస్తే 24 రైలు టికెట్లు బుక్ చేయొచ్చు. దీనితో ప్రయాణికులకు రిలీఫ్ కలగనుంది. ఇక ఇది ఇలా ఉంటే ఐఆర్‌సీటీసీ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ ని ఎలా లింక్ చెయ్యాలో చూద్దాం.

ఐఆర్‌సీటీసీ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ ని ఇలా లింక్ చేయండి:

ఆధార్ లింక్ చేసిన రైల్వే ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ యాప్ లేదా వెబ్‌సైట్‌ ద్వారా బుక్ చెయ్యచ్చు.
అధికారిక వెబ్‌సైట్‌ ని ఓపెన్ చెయ్యాలి.
లింక్ యువర్ ఆధార్ పై క్లిక్ చేయాలి.
డీటెయిల్స్ ని ఎంటర్ చెయ్యాలి.
Send OTPపై క్లిక్ చేయాలి.
ఇప్పుడు మీకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
దానిని సబ్మిట్ చేయాలి.
కేవైసీ ప్రాసెస్ అయ్యాక మీ ఆధార్ నెంబర్ ఐఆర్‌సీటీసీ అకౌంట్‌కు లింక్ అవుతుంది.
లాగౌట్ చేసి మళ్లీ లాగిన్ చేయాలి.
మై అకౌంట్‌ స్టేటస్ చెక్ చేయొచ్చు.
స్టేటస్‌లో లింక్ అయినట్టు ఉంటుంది అంతే.
ఇలా మీరు ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఒక నెలలో మొత్తం 24 రైలు టిక్కెట్లను బుక్ చేయొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news