ఫోకస్ పెట్టి అదే పనిగా వెతికితే మట్టిలో మానిక్యాలు ఎంతోమంది ఉంటారు.విభిన్నమైన ప్రతిభాపాటవాలు ఉన్నవారు, శారీరక దారుఢ్యం ఉన్న వారు.. ఏ పనినైనా అవలీలగా చేయగలిగిన వారు నేటికీ అనేక గ్రామాలలో చాలామంది యువకులు ఉన్నారు.అటువంటి వారి శక్తి అంతా సరైన ప్రోత్సాహం లేక గ్రామాలకే పరిమితం అవుతుంది. ఇక విషయానికొస్తే.. 50 కేజీలు ఉన్న 3 యూరియా బస్తాలు అవలీలగా మోసిన యువకుడు..నిజంగా 25 కిలోల బియ్యం బస్తా మొయ్యాలి అంటేనే మా వల్ల కాదు అంటున్న యువత నేటి రోజుల్లో ఎంతోమంది ఉన్నారు. పొరపాటున మోయవలసి వస్తే ఇబ్బందులు పడతారు.
కానీ తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ యువకుడు 50 కేజీలు ఉన్న 3 యూరియా బస్తాలు తలపై పెట్టుకొని అవలీలగా పొలం గట్లపై నడిచి వెళ్ళాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆ యువకుడి స్టామినాకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం తిమ్మరాయ పహాడ్ గ్రామ శివారు చంద్రు తండా కు చెందిన నారావత్ అనిల్ తన పొలానికి యూరియా బస్తాలు తీసుకొని వెళుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఒక్కొక్క బస్తా 50 కిలోల బరువున్న మూడు యూరియా బస్తాలను తలపై పెట్టుకుని పొలం గట్టుమీద కాస్త కూడా అటు ఇటు తొణకక, బెణకక అవలీలగా నడిచి వెళుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..వరంగల్ బాహుబలి అంటూ ఆ యువకుడిని కొనియాడుతున్నారు. ఇంకా కొంత మంది నెటిజన్లు ఆ యువకుడు గట్టు మీద అంత బరువుతో నడవటం చూసి పడితే ఇంకా ఏమైనా ఉందా అంటూ అవాక్కవుతున్నారు. అతనికి సరైన ప్రోత్సాహం ఇస్తే మంచి బాడీ బిల్డర్ గా రానిస్తారని కామెంట్లు చేస్తున్నారు..అనిల్ కూడా తనకు బాక్సింగ్ అంటే ఎంతో ఇష్టమని, ఇంట్లోనే సొంతంగా తయారు చేసుకున్న పరికరాలతో నిత్యం వ్యాయామం చేస్తానని చెబుతున్నాడు. పెద్ద బాక్సర్ కావాలన్నదే తన ఆశయమని అనిల్ చెబుతున్నాడు.మరి ఇతడి కల నెరవేరుతుందా..లేదా..చూడాలి..
మట్టిలో మాణిక్యం.. పొలం గట్టుపై 150కిలోల బరువు అవలీలగా మోసిన వరంగల్ బాహుబలి!!#warangal pic.twitter.com/zO6SeEfEU7
— oneindiatelugu (@oneindiatelugu) September 14, 2022