కేసీఆర్ పై షర్మిల ఫైర్.. కాళేశ్వరంపై ఉన్న ప్రేమ పాలమూరుపై లేదని మండిపాటు

-

ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. కాళేశ్వరంపై ఉన్న ప్రేమ పాలమూరుపై లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు ప్రజలు వలస వెళ్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదన్నారు. పాలమూరు వలసలు ఆగాలని, జిల్లా పచ్చబడాలని భీమా, కోయల్ సాగర్, నెట్టెంపాడు, కేఎల్ఐ ప్రాజెక్టులు తెచ్చింది వైఎస్ అని, ఆయన తర్వాత ఒక్క ఎకరానికి అదనంగా నీళ్లివ్వలేకపోయారని ఆరోపించారు.

వెయ్యికోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే పెండింగ్ ప్రాజెక్టుల్ని ఎందుకు పూర్తిచేయలేకపోయారని ఎదురుదాడికి దిగారు. మహబూబ్ నగర్ తితిదే కళ్యాణ మండపం వద్ద ‘పాలమూరు-నీళ్లపోరు’ పేరిట 24 గంటల నిరాహార దీక్షను ఆమె ప్రారంభించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయలేని కేసీఆర్ నిర్లక్ష్యానికి నిరసనగా దీక్ష చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. సాకులు చెప్పకుండా వెంటనే ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

ఇప్పటి వరకూ ఖర్చు చేసిన 17వేల కోట్లు నీళ్లలోపోసినట్లేనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని సగానికి పైగా సాగునీటి ప్రాజెక్టులు మేఘా కృష్ణారెడ్డికే అప్పగిస్తున్నారని, దీనిపై కాంగ్రెస్, భాజపాలు సైతం పెదవి విప్పడం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news