వీడియో : ధోనీ రిటైర్ అయిన తర్వాత ఇదే పని చేస్తాడట..! ధోనీయే చెప్పాడు

-

ఈ మధ్య ధోనీ త్వరలో రిటైర్ కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వరల్డ్ కప్ అయిపోగానే ధోనీ… అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నట్టు వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ కూడా ఈ విషయం కన్ఫమ్ చేసింది.

ఎంఎస్ ధోనీ.. ప్రతి భారతీయుడు ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి. ఎక్కడి బీహార్.. ఎక్కడి టీమిండియా.. ఎక్కడి వరల్డ్ కప్.. ఎక్కడి కెప్టెన్.. ఎక్కడి టికెట్ కలెక్టర్. అసలు.. ధోనీ జీవితాన్ని చూస్తే… ఒకదానికి, మరోదానికి సంబంధమే ఉండదు. అవును… ధోనీ జీవితాన్ని ప్రతి ఒక్కరు చదవాల్సిందే. పడి లేచిన కెరటం ఆయన. ఎన్నో దెబ్బలు.. ఎన్నో ఆటంకాలు.. ఎన్నో సమస్యలు.. అన్నింటినీ దాటుకొని క్రికెట్ లో తన సత్తా చాటాడు ధోనీ.

ఈ మధ్య ధోనీ త్వరలో రిటైర్ కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వరల్డ్ కప్ అయిపోగానే ధోనీ… అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నట్టు వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ కూడా ఈ విషయంపై కన్ఫమ్ చేసింది.

అయితే.. ధోనీ క్రికెట్ కు గుడ్ బై చెప్పాక ఏం చేస్తారు? ఆయన దగ్గర ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా? రిటైర్మెంట్ తర్వాత ధోనీ జీవితం ఎలా ఉండబోతోంది.. అనే ఆతృత ధోనీ అభిమానుల్లో ఉంటుంది. దానికి ధోనీ సమాధానం కూడా ఇచ్చారు.

అవును.. ధోనీ తన రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తాడో కూడా చెప్పేశాడు. నిజానికి ధోనీకి పెయింటింగ్ అంటే చాలా ఇష్టమట. ఆయన చిన్నతనంలో వేసిన పెయింటింగ్స్ ను ఇంకా దాచుకున్నాడంటే అర్థం చేసుకోవచ్చు.. ఆయనకు పెయింటింగ్ అంతే ఎంత ఇష్టమో.

ఇప్పటికే క్రికెట్ లో రారాజుగా వెలిగాడు. టీమిండియాకు రెండు సార్లు వరల్డ్ కప్ చాంపియన్ ట్రోఫీని అందించాడు. క్రికెట్ కు ఎంత చేయాలో అంత చేశాడు. అందుకే… తనకు ఇష్టమైన పెయింటింగ్ పై ఇక దృష్టి పెట్టాలని ధోనీ భావిస్తున్నాడట. తను క్రికెట్ కు గుడ్ బై చెప్పాక చేసే పని అదేనట. నమ్మరా.. ఈ విషయాన్ని ధోనీయే స్వయంగా చెప్పాడు. కావాలంటే ఈ వీడియో చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news