బిగ్‌బాస్ షోనే ప్రారంభం కాలేదు.. అప్పుడే సోషల్ మీడియాలో శ్రీముఖి ఆర్మీ హల్‌చల్

-

బిగ్‌బాస్ సీజన్ వన్‌లో ఈ ఆర్మీల గోల లేదు కానీ.. సెకండ్ సీజన్‌లో కౌశల్.. బిగ్ బాస్ విన్నర్ అయ్యాడంటే దానికి కారణం కౌశల్ ఆర్మీనే. అదేవిధంగా ఇప్పుడు శ్రీముఖికి కూడా ఆర్మీ ఏర్పడింది. అంతే కాదు.. బిగ్‌బాస్ సీజన్ 3 విన్నర్ శ్రీముఖే.. కన్ఫమ్ అంటూ ఆర్మీల పేజీల్లో పోస్టులు కూడా అప్పుడే దర్శనమిస్తున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 3. ఈనెల 21నే షో ప్రారంభం కానుంది. ఈసారి 14 మంది కంటెస్టెంట్లు.. 100 రోజుల పాటు బిగ్‌బాస్ హౌజ్‌లో ఉంటారు. అయితే.. ఇప్పటికే హోస్ట్ కన్ఫమ్ అయ్యాడు. హోస్ట్ నాగార్జునకు సంబంధించిన ప్రోమోలు కూడా రిలీజ్ అయ్యాయి. కానీ.. కంటెస్టెంట్లు ఎవరు? అనేదానిపై మాత్రం క్లారిటీ లేదు.

అయితే.. కంటెస్టెంట్లు వీళ్లే.. అంటూ సోషల్ మీడియాలో కొందరి పేర్లు వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. వాళ్లలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు శ్రీముఖి. బిగ్‌బాస్ షోలో సెలెక్ట్ అయింది కాబట్టే.. పటాస్ షోను శ్రీముఖి వదిలేసిందని వార్తలు వచ్చాయి. అంతే కాదు.. ఆమె ఇప్పుడు ఇదివరకులా లేదు. బాగా సన్నబడింది. ఆ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. వీటిని బట్టి శ్రీముఖి ఖచ్చితంగా బిగ్‌బాస్ షోకు సెలెక్ట్ అయిందని తెలుస్తోంది.

మరోవైపు అప్పుడే శ్రీముఖి ఆర్మీ పేరుతో సోషల్ మీడియాలో పేజీలు అప్పుడే ప్రారంభం అయ్యాయి. ఆలు లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్టుగా.. అసలు బిగ్‌బాస్ షోనే ప్రారంభం కాలేదు.. శ్రీముఖి కన్ఫమే కాలేదు.. అప్పుడే శ్రీముఖి ఆర్మీ పేరుతో సోషల్ మీడియాలో పేజీలు పుట్టుకురావడంతో బిగ్‌బాస్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

బిగ్‌బాస్ సీజన్ వన్‌లో ఈ ఆర్మీల గోల లేదు కానీ.. సెకండ్ సీజన్‌లో కౌశల్.. బిగ్ బాస్ విన్నర్ అయ్యాడంటే దానికి కారణం కౌశల్ ఆర్మీనే. అదేవిధంగా ఇప్పుడు శ్రీముఖికి కూడా ఆర్మీ ఏర్పడింది. అంతే కాదు.. బిగ్‌బాస్ సీజన్ 3 విన్నర్ శ్రీముఖే.. కన్ఫమ్ అంటూ ఆర్మీల పేజీల్లో పోస్టులు కూడా అప్పుడే దర్శనమిస్తున్నాయి. వామ్మో.. వీళ్లు మరీ ఇంత స్పీడా? చూద్దాం.. రాను రాను ఏం జరుగుతుందో?

Read more RELATED
Recommended to you

Latest news