సినీ ఇండస్ట్రీలో తమ నటనతో కామెడీతో ప్రేక్షకులను అలరించిన అతి కొద్దిమంది నటులలో ప్రముఖ నటుడు కళ్ళ చిదంబరం కూడా ఒకరు. నిజానికి కొంతమంది నటులు తమకున్న అంగవైకల్యమే తమకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అని అంటారు . ఇక అలాంటి వారిలో కళ్ళ చిదంబరం ముందు ఉంటారని చెప్పవచ్చు. ఈయనకున్న మెల్లకన్నె ఆయన సినీ కెరియర్ కు విజయ మార్గాన్ని చూపించిందంటూ చెబుతూ ఉంటారు. అయితే ఇదే ఆయన జీవితాన్ని నాశనం చేసింది అని చెప్పడంలో సందేహం లేదు. అసలు విషయాన్ని ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
కళ్ళ చిదంబరం అసలు పేరు కొల్లూరి చిదంబరం. ఆయన కళ్ళు చిత్రం ద్వారా తెలుగు సినిమాల్లోకి అరంగేట్రం చేశాడు. తన మొదటి సినిమా పేరును ఇంటిపేరుగా మార్చుకొని కళ్ళు చిదంబరంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 300 కు పైగా సినిమాలలో నటించి.. ఎన్నో సినిమాలలో ప్రత్యేకమైన పాత్రలు కూడా పోషించారు. ఆ కళ్ళతో హాస్యాన్ని పండించి.. ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్న ఈయనకు..అందరూ అనుకుంటున్నట్టు చిన్నప్పటినుంచి మెల్లకన్ను లేదు.. అసలు విషయం ఏమిటంటే దాదాపు 12 సంవత్సరలుగా నిద్ర లేకుండా వరుసగా నాటకాలు నిర్వహించడంతో ఒక కంటి నరంతెగి అది మెల్లకన్నుగా మారింది.ఇక ఆ లోపమే ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గోవిందా గోవిందా సినిమాలో.. శ్రీదేవి – నాగార్జున మధ్య ఒక సన్నివేశం ఉంది. అయితే షూటింగ్ సమయంలో శ్రీదేవి కళ్ళ చిదంబరం గారిని చూసి భయపడిందో ఏమో ఆయనతో సినిమా చేయనని చెప్పేసింది. కానీ రామ్ గోపాల్ వర్మ కళ్ళ చిదంబరం గొప్పదనాన్ని చెప్పి ఆయన ఉంటేనే ఈ సినిమా తీస్తాను.. లేకపోతే ఆపేస్తానని చెప్పడంతో.. ఆయన ప్రతిభ ను గుర్తించిన శ్రీదేవి ఆయనతో ఆ సీన్ లో నటించడానికి ఒప్పుకుంది . ఇప్పటికీ కూడా కళ్ళు చిదంబరం గారి మంచితనాన్ని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటూ ఉంటారు అనడంలో అతిశయోక్తి కాదు.