వ్యాపారం చేయాలంటే.. పట్టణాలు, సిటీలే కాదు.. పల్లెలు కూడా అనుకూలమో.. అక్కడ కూడా చేయదగ్గ వ్యాపారాలు చాలా ఉన్నాయి. ఇంకా వాటితో లాభాలు కూడా పొందవచ్చు.. వ్యవసాయానికి సంబంధించిన స్టార్టప్‌లను ప్రారంభిస్తే.. మీ కష్టానికి తగ్గ ఫలితాలు పొందవచ్చు. ఇంతకీ అవేటంటే..
డైయిరీ ఫామ్ : దేశంలో జనాభా పెరుగుదలతో పాటు పాలు, దాని నుంచి తయారైన ఉత్పత్తులకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఈ డిమాండ్‌ను పెద్ద పెద్ద కంపెనీలు అంతలా నెరవేర్చలేకపోతున్నాయి. మీరు మీ గ్రామంలో డైయిరీ ఫామ్‌ని ఏర్పాటు చేసుకుంటే…10 ఆవులు, గేదెలతో పాల వ్యాపారం ప్రారంభించవచ్చు. మంచి నాణ్యమైన పాలను అమ్మితే.. మంచి ధర కూడా లభిస్తుంది. అంతే కాకుండా ఆవు, గేదెల పేడను పొలాలకు సేంద్రియ ఎరువుగా వాడుకోవచ్చు. ఈ విధంగా రైతులు తక్కువ ఖర్చుతో డెయిరీ ఫామ్ వ్యాపారాన్ని ప్రారంభించి.. మంచి ఆదాయం పొందవచ్చు. అయితే దీనికి కాస్త కష్టపడాల్సి ఉంటుంది.
బేకరీ ఉత్పత్తులు– ఈ వ్యాపారం ఎప్పుడూ విఫలమవదు. లక్షల్లో కూడా లాభాలు వస్తాయి. నేటి కాలంలో ప్రజలు ఆరోగ్య కారణాల దృష్ట్యా.. సేంద్రీయ, స్వచ్ఛమైన ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో పోషకమైన ధాన్యాలు, పప్పులు, వాటి పిండి తయారీ యూనిట్‌తో కలిపి బేకరీ వ్యాపారం చేస్తే మంచి ఆదాయం వస్తుంది. ఇందుకోసం మైక్రో ఫుడ్ ఇండస్ట్రీ అప్‌గ్రేడేషన్ స్కీమ్ కింద కూడా ఆర్థిక సహాయం తీసుకోవచ్చు.
వర్మీ కంపోస్ట్- సేంద్రీయ ఉత్పత్తులకు ఇండియాలో గిరాకీ బాగా ఉంది. సేంద్రీయ పండ్లు, కూరగాయలు తినేందుకు జనాలు మొగ్గుచూపుతున్నారు. చాలా చోట్ల సేంద్రీయ ఎరువుల కొరత ఉంది. అందువల్ల చాలా మంది రైతులు రసాయనాలపై ఆధారపడుతున్నారు. మీరు వర్మీ కంపోస్ట్ యూనిట్‌ను ప్రారంభిస్తే..మంచి లాభాలు వస్తాయి. ఈ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రుణాలు, రాయితీలు, ఆర్థిక గ్రాంట్లు కూడా ఇచ్చి ప్రోత్సాహిస్తున్నాయి.
తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఆ వ్యాపార ఉత్పత్తులు అనేవి వినియోగదారునికి డైలీ కావాల్సినవి అయి ఉండాలి. పైన చెప్పినవి మనకు నిత్యంగా కావాల్సినవే. ఇలాంటి వ్యాపారం చేస్తే.. కాస్త కష్టమైన లాభాలు అయితే పొందవచ్చు.