ది లెజెండ్ హీరో నెక్ట్స్​ మూవీ అప్​డేట్.. ఈసారి లవర్​బాయ్​గా!!

-

సినిమాపై ఉన్న ఆసక్తితో ఎంతోమంది నటుడిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అలాంటి వారిలో ‘ది లెజెండ్‌’ హీరో శరవణన్​ ఒకరు. 52ఏళ్ల వయసులో హీరోగా గ్రాండ్​గా సిల్వర్​స్క్రీన్​ ఎంట్రీ ఇచ్చి.. దేశవ్యాప్తంగా తన పేరు మారుమోగేలా చేసుకున్నారు. ఒక్కసారిగా భారీ ప్రమోషన్స్‌తో వెలుగులోకి వచ్చారు. జేడీ, జెర్రీల ద్వయం దర్శకత్వం వహించిన ఈ భారీ చిత్రాన్ని రూ.60కోట్ల బడ్జెట్​తో సొంతంగా నిర్మించారు. కానీ ఈ మూవీ ఆశించిన విజయాన్ని సాధించలేదు.

అయితే తొలి ప్రయత్నం విఫలమైనా శరవణన్‌ మరో ప్రయత్నానికి సిద్ధమయ్యారన్నది కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది.
కోలీవుడ్‌ వర్గాల ప్రకారం.. త్వరలోనే ఆయన కొత్త సినిమా అప్డేట్ ఇవ్వనున్నారని, ఈ సారి ఏకంగా లవర్‌బాయ్‌గా మారబోతున్నారట. రోమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించనున్నారని తెలిసింది.

ఇప్పటికే ఓ కొత్త దర్శకుడితో చర్చలు జరిపి, కథను ఫైనల్‌ చేశారట. త్వరలోనే గ్రాండ్‌గా అనౌన్స్‌ చేయబోతున్నారని సమాచారం. అన్నట్లు.. ఇది కూడా పాన్‌ ఇండియా చిత్రమేనట.. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటనను దీపావళి సందర్భంగా వెల్లడించనున్నట్లు తెలిసింది.

ఇక శరవణన్..’లెజెండ్’​ అనే చిత్రంతో వెండితెరపైకి అరంగేట్రం చేశారు. ఐదు పదుల వయసులోనూ స్టార్​ హీరోలకు ఏమాత్రం తగ్గనంటూ ఆ సినిమాలో నటించారు. దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా తర్వాత శరవణన్‌పై ఎన్నో ట్రోల్స్‌ సైతం నెట్టింట్లో హల్​చల్​ చేశాయి.

Read more RELATED
Recommended to you

Latest news