హిట్లర్​ మూవీ ఆ హీరో చేయాల్సింది.. కానీ చిరు చేతికి ఎలా వచ్చిందంటే?

-

 

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు మూడు తరాల ప్రేక్షకులను అలరిస్తున్న ఈ మెగాస్టార్ ఇప్పటికీ తెలుగు చిత్రసీమలో అగ్రహీరోగా కొనసాగుతున్నారు. అయితే చిరు కెరీర్​లో ఎన్నో ఒడుదొడుకులు ఉన్నాయి. 150కి పైగా నటించిన ఆయన సినిమాల్లో ఎన్నో హిట్లు ఉన్నాయి అలానే పరాజయాలు కూడా ఉన్నాయి.

అయితే ఆయన కెరీర్​లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన సినిమాల్లో ‘హిట్లర్’ ఒకటి. అప్పటి వరకు యంగ్ డైనమిక్ హీరోగా నటించిన చిరు ఇందులో మాత్రం బాధ్యతాయుతమైన వ్యక్తిగా నటించారు.. ఐదుగురు చెల్లెళ్లకు అన్నగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

హిట్లర్ సినిమా మలయాళంలో 1996లో మమ్ముట్టి హీరోగా సిద్ధిఖీ దర్శకత్వంలో తెరకెక్కింది. అయితే ఈ సినిమా తెలుగు రీమేక్​ హక్కులను నిర్మాత, ఎడిటర్​ మోహన్ కొనుగోలు చేశారు. అలానే ఈ చిత్రాన్ని ముందుగా మోహన్ బాబుతో ఈ.వి.వి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కించాలని అనుకున్నారట. కానీ అప్పటికే మోహన్​బాబు బిజీగా ఉండటంతో చిరుతో చేయాలని నిర్ణయించుకున్నారు. అలానే అనివార్య కారణాలతో ఇ.వి.వితో కాకుండా డైరెక్టర్​ ముత్యాల సుబ్బయ్యతో.. చిరు ఇమేజ్ కూడా తగ్గట్టుగా కథలో మార్పులు చేసి రూపొందించారు. అలా విడుదలైన ఈ సినిమా సూపర్​హిట్​గా నిలిచింది.

కాగా, ప్రస్తుతం చిరు నటిస్తున్న సినిమాల్లో ‘గాడ్​ఫాదర్’​ ఒకటి. దీనికి దర్శకుడిగా నిర్మాత మోహన్​ కుమారుడు మోహన్​బాజా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మలయాళ హిట్‌ సినిమా ‘లూసిఫర్‌’కు రీమేక్‌గా రూపొందింది. ఈ పొలిటికల్‌ యాక్షన్‌ మూవీలో సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం అందించారు. రామ్‌చరణ్‌, ఆర్‌.బి. చౌదరి, ఎన్‌.వి. ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా అక్టోబరు 5న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘తార్‌మార్‌’ పాటను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది మూవీ టీమ్​. ప్రస్తుతానికి లిరికల్‌ వీడియో ప్రోమో (యూట్యూబ్‌), ఆడియో సాంగ్‌ (స్పోటిఫై యాప్‌) సందడి చేస్తున్నాయి. మంగళవారం పూర్తి సాంగ్ రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news