అల్లు అర్జున్​కు అర్హ ఛాలెంజ్.. చిత్తుగా ఓడిపోయిన ఐకాన్ స్టార్

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​కు సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తన సోషల్ మీడియా ఫ్యాన్స్​ కోసం అల్లు అర్జున్ అప్పుడప్పుడు సర్​ప్రైజ్ పోస్టులు షేర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తన ఫ్యామిలీతో స్పెండ్ చేసిన మెమొరీస్​ను ఐకాన్ స్టార్ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్​తో పంచుకుంటారు.

ముఖ్యంగా తన కూతురు అల్లు అర్హతో ఈ ఐకాన్ స్టార్ చేసే సందడి అంతా ఇంతా కాదు. వీరిద్దరి కాంబినేషన్​ అంటే అభిమానులకు ఎంతో ఇష్టం. కొన్నిరోజుల క్రితం బెండకాయ, దొండకాయ నువ్వే నా గుండెకాయ అంటూ అర్హ.. అల్లు అర్జున్​తో చేసిన సందడి అప్పట్లో సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్. ఇప్పుడు అలాంటి ఓ వీడియో ఒకటి మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సారి డైలాగ్స్​తో కాదు అర్హ.. తన డాడీకి ఓ ఛాలెంజ్ విసిరింది. అదేంటంటే..?

గంగిగోవు పాలు గరిటెడైన చాలు అంటూ ఓ పద్యాన్ని పొడుపు కథ అని చెప్పి ఆ పొడుపు కథని విప్పమని అల్లు అర్జున్​కి అర్హ సవాల్ విసిరింది. దానికి అల్లు అర్జున్ జున్ను అని చెప్పాడు. నీకెలా తెలుసు ఉంటూ అర్హ ముద్దు ముద్దుగా తన డాడీని అడుగుతుంది. అంతే కాకుండా మరో ఛాలెంజ్ విసురుతుంది అల్లు అర్జున్​కి. నాలుగు ఎర్ర లారీలు.. నాలుగు నల్ల లారీలు అని తప్పు లేకుండా ఫాస్ట్​గా చెప్పమంటుంది. ఈ ఛాలెంజ్​లో ఐకాన్ స్టార్ చిత్తుగా ఓడిపోయాడు. సోషల్ మీడియా ఐకాన్ స్టార్ పోస్టు చేసిన ఈ వీడియోను నెటిజన్లు తెగ లైక్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news