ఇలాగే కంటిన్యూ అయితే నాగార్జున బిగ్ బాస్ కి గుడ్ బై చెప్పినట్టే.!!

-

తెలుగు బుల్లితెర పై అత్యంత ప్రావీణ్యం పొందిన రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకుంది బిగ్ బాస్. ప్రస్తుతం నాగార్జున సినిమాలకు ఇస్తున్న ప్రాముఖ్యత బిగ్ బాస్ కి కూడా ఇస్తున్నారని చెప్పవచ్చు.. ఇక బిగ్ బాస్ 4 సీజన్ లకు కూడా ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆరవ సీజన్ కి కూడా హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఈసారి అత్యధిక పారితోషకం నాగార్జున తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే పారితోషకం విషయంలో నాగార్జున ఏ రోజు కూడా పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ ఆయన ఈ షో ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతున్నానన్న ఉద్దేశంతోనే చేస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు కూడా చెబుతున్నారు. కానీ ఇటీవల రెమ్యునరేషన్ పెంచినంత మాత్రాన ముందు ముందు కూడా కంటిన్యూ అవుతాడని కూడా కొంతమంది భావిస్తూ ఉండడం గమనార్హం.

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ రేటింగ్ ఈ మధ్యకాలంలో మరీ దారుణంగా పడిపోయింది. ఎందుకంటే కంటెస్టెంట్ల ముఖాలు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవడం , అందులో వినోదం కూడా ప్రేక్షకులకు పెద్దగా అనిపించకపోవడం వల్లే బిగ్బాస్ చూసే వారి సంఖ్య కూడా తగ్గిపోతుంది. అందుకే నాగార్జున కూడా మెల్లమెల్లగా ఈ కార్యక్రమానికి దూరం అయ్యే అవకాశం కూడా ఉందంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే నాగార్జున త్వరలోనే బిగ్ బాస్ ప్రేక్షకులకు చేదు నిజాన్ని తెలియజేస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే కొంతమంది అభిప్రాయం ప్రకారం ఆయన సీజన్ 10 వరకు హోస్ట్గా వ్యవహరించే అవకాశం ఉందంటూ కూడా తెలియజేస్తున్నారు. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఇప్పటికే నాగార్జునతో హోస్ట్ గా ఒప్పందం చేసుకున్నారని, నాగార్జున ఒప్పంద నుండి బయటకు వెళ్లలేడు అంటూ కూడా సన్నిహిత వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ వార్త అభిమానులకు గుడ్ న్యూస్ కానీ పుకార్లు మాత్రం బలంగా వినిపిస్తుండడంతో ఆయన ఈ సీజన్ తర్వాత నెక్స్ట్ సీజన్ కి హోస్టుగా వచ్చే అవకాశం లేదన్నట్లు వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news