సీఎం జగన్ అవినీతి పాలనపై 5 వేల సభలు పెడతామని సోము వీర్రాజు హెచ్చరించారు. గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీలోపు వైసీపీ ప్రభుత్వం సర్పంచ్ లకు నిధులు విడుదల చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. లేదంటే అక్టోబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బిజెపి ధర్నా చేస్తుందని వెల్లడించారు.
జగన్ సిఎం అయ్యాక ప్రజల్లో లేరు.. ఒక్క సారి కూడా సెక్రటేరియట్ కు వెల్లేదు.. అసెంబ్లీకి అప్పుడపుడు వెళ్తారు, అబద్ధాలు చెప్తారని ఆగ్రహించారు. ఇసుక సంవృద్దిగా వున్న తక్కువ ధరకు మాత్రం రాదు.. జగన్ ఒక అబద్ధాల కోరు… టిడిపి లో ఇసుక చౌక…. ప్రస్తుతం బంగారం కంటే అధిక ధర పలుకుతుందని విమర్శలు చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ వుందని…. సిమెంట్ ధర పెంచారు… పసుపు కుంకుమ పేరుతో 35 వేల కోట్లు ఖర్చుపెట్టిన చంద్రబాబు… రాజధాని మాత్రం కట్టలేదన్నారు. రాజధాని ప్రాంతంలో ఇళ్లు కట్టి మూడు రాజధానులు అంటాడని జగన్ పై మండిపడ్డారు సోము వీర్రాజు.