జింఖానా గ్రౌండ్స్ తొక్కిసలాటలో మహిళ చనిపోలేదు – పోలీసులు

-

ఈ నెల 25న భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ నేపథ్యంలో మ్యాచ్‌ టికెట్ల జారీలో జాప్యంపై క్రికెట్‌ అభిమానులు ఇవాళ ఉదయం క్యూ కట్టారు. ఇక హెచ్‌సీఏ వైఖరికి నిరసనగా నగరంలోని జింఖానా మైదానం వద్ద ఆందోళనకు దిగారు.

అయితే.. భారత్-ఆస్ట్రేలియా టి20 టికెట్ల కోసం క్యూలో నిలబడి తొక్కిసలాఆటలో గాయపడ్డ ఓ మహిళ చనిపోయింది. గేటు దగ్గర జరిగిన తొక్కేసినట్లు స్పృహ కోల్పోయిన మహిళను… ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ప్రాణాలు వదిలిందని వార్తలు వచ్చాయి.

మహిళను బ్రతికించేందుకు పోలీసులు సిపిఆర్ చేసిన ప్రయోజనం దక్కలేదని వార్తలు వైరల్‌ అయ్యాయి. అయితే.. ఈ వార్తలపై స్వయంగా పోలీసులే.. స్పందించారు. జింఖానా గ్రౌండ్స్ లో జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన వార్తని ఖండించారు పోలీసులు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు స్పష్టం చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news