స్ట్రోక్స్ ఎప్పుడు వస్తాయో ఎలా వస్తాయో ఎవ్వరూ ఊహించలేరు. సాధారణంగా హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు మనిషి బతకడం చాలా కష్టం.. బ్రెయిన్ స్ట్రోక్ కూడా అంతే ప్రమాదం.. అయితే గుండె జబ్బులు కంటే బ్రెయిన్ సమస్యతో బాధపడే వారి సంఖ్య కాస్త తక్కువగా ఉంటుంది. గుండె ఆరోగ్యంపైనే మనకు అవగాహన ఉండదాయే…ఇక అరుదుగా వచ్చే బ్రెయిన్ సమస్యలపై ఇంకే శ్రద్ధ ఉంటుంది. కానీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేముందు కొన్ని సాధారణ లక్షణాలు ఉంటాయి.. వాటిని మీరు గమనించకపోతే చాలా ప్రమాదం.. మరి అవేంటంటే..
మెదడులో కొన్ని భాగాలకు రక్తం సరఫరా ఆగిపోవడంతో స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆక్సిజన్ కణాల్లోకి సరఫరా నిలిచిపోవడం కారణంగా ఇలా జరిగే ప్రమాదం ఉంది. లేకపోతే ప్రాణాలకే ముప్పు. ప్రమాదం జరగడానికి కొన్ని రోజులు, గంటల ముందే కొన్ని లక్షణాలు గుర్తించినట్లయితే ఎంతో మేలని అంటున్నారు వైద్య నిపుణులు.
బ్రెయిన్ స్ట్రోక్‌కు నెల ముందు వచ్చే లక్షణాలు ఇవే…
ముఖం, చేతులు, కాళ్లు ఒక వైపు మాత్రమే మొద్దుబారడం
నెల ముందు నుంచే కంటి చూపులో తేడా కనిపించడం, కళ్లు మసకబారడం లాంటివి
ఈ స్ట్రోక్ వచ్చే ముందు అకస్మాత్తుగా ప్రవర్తనలో మార్పు వస్తుంది.
అధిక రక్తపోటు
ఉన్నట్టుండి కొన్ని విషయాలు మార్చిపోవడం
వికారం, వాంతులు, మెదడులో కొన్ని భాగాల్లో వచ్చిన సమస్యల కారణంగా వాంతులు, వికారంగా ఉండటం చూపులో సమస్యతో పాటు భ్రమ పడుతున్నట్లు కూడా అనిపించడం
అలాగే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన చాలా మంది ఆడవాళ్లలో కనిపించిన లక్షణం తలనొప్పి. చాలా మంది తలవెనుక భాగంలోనే అలా అనిపించినట్లు ఉంటుందట..
ఒక్కో సమయంలో స్పృహ కూడా కోల్పోయి పడిపోయే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. అలాగే శ్వాసలో సమస్య ఏర్పడుతుంది.
ఛాతీనొప్పి, శ్వాసలో సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే అది స్ట్రోక్ అని గుర్తించాలంటున్నారు.
ఇక ఎక్కిళ్లు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. ఓహియో స్టేట్ యూనివర్సిటీ వెక్సనర్ మెడికల్ సెంటర్ జరిపిన సర్వే ప్రకారం..10 శాతం మంది మహిళలకు ఎక్కిళ్లు ఎక్కువగా వస్తాయని అధ్యయనంలో గుర్తించారు. అలాగే ఈ బ్రెయిన్ స్ట్రోక్‌పై యూకేలో 1300 మందిపై జరిపిన సర్వేలో ఈ విషయాలు తేలాయి.
అధికంగా ఆలోచించడం కంటే యోగా, ధ్యానం లాంటివి చేసుకుంటూ మనసు ప్రశాంతంగా ఉంచుకునే విధంగా చూసుకోవాలి. వీలైనంత వరకూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. జంక్ ఫుడ్స్ తినే అలవాటు ఉన్నా వాటితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే పోషకాహారాలు తీసుకోవాలి.