ఈ LIC స్కీమ్ తో తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభాలు..!

-

లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని కూడా దీనితో పొందొచ్చు. ఎల్‌ఐసీలో డబ్బులు పెడితే మంచిగా లాభాలు వస్తాయి. పైగా ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. పెట్టుబడికి సెక్యూరిటీ ఉంటుంది. అయితే LIC అందించే స్కీమ్స్ లో జీవన్ ప్రగతి ప్లాన్ కూడా ఒకటి.

ఇక జీవన్ ప్రగతి ప్లాన్ గురించి పూర్తి వివరాల లోకి వెళితే.. 2016 లో ఈ స్కీమ్ ని స్టార్ట్ చేసారు. మంచిగా డబ్బులు పొందేందుకు ఈ స్కీమ్ బాగా ఉపయోగ పడుతుంది. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే లక్షల రూపాయల రాబడిని పొందవచ్చు. రిస్క్ కవర్ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ఈ పధకం లో క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించాలి. ఒకవేళ పాలసీదారుడుకి ఏమైనా అయితే నామినీ కి ఆ డబ్బులు వస్తాయి.

ఈ స్కీమ్ వలన కలిగే లాభం:

పాలసీదారుడు పాలసీని కొనుగోలు చేసిన 6 నుంచి 10 సంవత్సరాలలో మరణిస్తే 125% హామీ మొత్తం లభిస్తుంది. అదే 11 నుంచి 15 ఏళ్లలో అయితే 150%, 16 నుంచి 20 సంవత్సరాలలో 200 శాతం హామీ వస్తుంది. అదే కనుక రైడర్ ప్రయోజనాన్ని పొందాలనుకుంటే అదనపు మొత్తాన్ని పే చెయ్యాల్సి ఉంటుంది. 20 ఏళ్ల పాటు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్‌మెంట్‌ చెయ్యాల్సి వుంది. ప్రతి నెలకు 6 వేల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. వ్యక్తులు12 ఏళ్ళ వయస్సు నుండి ఈ పాలసీని స్టార్ట్ చెయ్యచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news