మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించనున్న 152వ సినిమా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్ర్కిప్ట్ పనులు పూర్తిచేసి క్యాస్టింగ్ ఎంపిక పనుల్లో తనమునకలై ఉన్నారు. కొన్ని నెలలు గా చిరుకు హీరోయిన్ ను సెట్ చేసే పనిలోనే కొరటాల బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అనుష్క, నయనతార, రాశీఖన్నా, తమన్నా ఇలా చాలా మంది భామల పేర్లు వినిపించాయి గానీ! ఇప్పటివరకూ ఎవర్నీ పైనల్ చేయలేదు. ఇక సెట్స్ కు వెళ్లే సమయం దగ్గరపడటంతో ఆ పనులని మరింత ముమ్మరం చేసారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర రూమార్ స సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరంజీవి సరసన మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ ని ఎంపిక చేసారు అనే వార్త వినిపిస్తోంది.
ఈ విషయం పై చిత్ర నిర్మాత రామ్ చరణ్ తో సంప్రదింపులు జరుపుతున్నాడట. ఐశ్వర్య రాయ్ ని దించాలంటే హైలెవల్లో ఇన్ ప్లూయెన్స్ వాడాల్సి ఉంటుంది. కొరటాలకు బాలీవుడ్ తో పెద్దగా పరిచయాలు లేవు కాబట్టి ఆ బాధ్యత రామ్ చరణ్ తీసుకోవాల్సి ఉంటుంది. అతనికి అదంత ఈజీ కాదు. ఎజెన్సీ ల ద్వారా అప్రోచ్ అయినా! ఫైనల్ గా నిర్మాత డైరెక్ట్ కాక తప్పదు. మెగాస్టార్ వయసుకు ఐసు సరితూగుతుందని..ఆమెను ఎంపిక చేసుకుంటే సినిమా స్థాయి కూడా మారుతుందని కొరటాల ఆమె వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. మరి ఇందులో నిజమెంతన్నది! తెలియదు గానీ రూమర్ మాత్రం సోషల్ మీడియాలో సంచలనే రేపుతోంది.
ఐశ్వర్య లాంటి యూనిర్శల్ స్టార్ తెలుగు సినిమాలో నటిస్తే సినిమాకు అసాధారణ క్రేజ్ దక్కుతుంది. అభిషేక్ బచ్చన్ ని పెళ్లాడిన తర్వాత ఐసు సినిమాలు తగ్గించింది. ఇప్పుడిప్పుడే మళ్లీ వరుసగా సినిమాలు చేస్తోంది. పెళ్లికి ముందు ఎలా నటించిందో పెళ్లి తర్వాత అదే గ్లామర్ ఎక్స్ ఫక్షజింగ్ లో అదే కంటున్యూ చేస్తోంది. ఆ మధ్య ఓ హీరో సినిమాలో అతనిలో లిప్ లాక్ వేసింది. పెళ్లి తర్వాత ఇలాంటి పాత్రలేంటని విమర్శలు వెల్లు వెత్తినా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా సమంతలా ముందు కెళ్తోంది.