2017 జనాభా లెక్కల ప్రకారం భారత్‌లో 133.92 కోట్ల జనాభా ఉండగా.. చైనా 138.64 కోట్ల జనాభాతో మొదటి స్థానంలో ఉంది. అయితే 2027 వరకు భారత్‌లో మరో 9.1 కోట్ల జనాభా పెరగనుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఏ రంగంలోనైనా భారత్ నంబర్ వన్ స్థానంలో ఉన్నా.. ఉండకపోయినా.. కచ్చితంగా జనాభా విషయంలో మాత్రం ఎప్పుడూ ముందే ఉంటుంది. ప్రస్తుతం అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. అయితే మరో దశాబ్ద కాలంలో ఆ జాబితాలో భారత్ నంబర్ వన్ స్థానానికి చేరుకుంటుందట. దీంతో మరో 10 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో మొదటి స్థానంలో నిలవనుంది.
2017 జనాభా లెక్కల ప్రకారం భారత్‌లో 133.92 కోట్ల జనాభా ఉండగా.. చైనా 138.64 కోట్ల జనాభాతో మొదటి స్థానంలో ఉంది. అయితే 2027 వరకు భారత్‌లో మరో 9.1 కోట్ల జనాభా పెరగనుంది. దీంతో మొత్తం 143.02 కోట్ల జనాభాతో భారత్ జనాభాలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలవనుంది. ఇక 2050 వరకు ప్రపంచ జనాభా ఇప్పుడున్న మొత్తానికి మరో 200 కోట్లు పెరగనుందట. ప్రస్తుతం 770 కోట్ల జనాభా ఉంటే 2050 వరకు అది 970 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు.
కాగా ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక సంతాన సాఫల్యత (ఫెర్టిలిటీ) రేటు నైజీరియాలోనే ఎక్కువ ఉందట. అక్కడ ఈ రేటు 5.4 (ఒక్క మహిళకు సరాసరిగా జీవిత కాలంలో పుట్టే పిల్లల సంఖ్య) శాతంగా ఉందని ఐక్యరాజ్యసమితి ఇచ్చిన ప్రపంచ జనాభా – భవిష్యత్ అంచనాలు అనే నివేదికలో వెల్లడైంది. కాగా ఈ రేటు భారత్‌లో 2.2 గా ఉందని సదరు నివేదిక చెబుతోంది. ఈ క్రమంలోనే రానున్న మూడు దశాబ్దాల కాలంలో భారత్‌లో 27.3 కోట్లు, నైజీరియాలో 20 కోట్ల జనాభా పెరుగుతుందని ఆ నివేదక అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఈ రెండు దేశాల్లోనే జనాభా పెరుగుదల రేటు బాగా ఎక్కువగా ఉందట. దీంతో భారత్ జనాభాలో చైనాను మించి పోతుందని తెలుస్తోంది. మరి జనాభా పెరుగుదలకు అనుగుణంగా సదుపాయాలను కల్పించకపోతే మాత్రం ముందు ముందు మరిన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. దీన్ని పాలకులు గమనిస్తారో, లేదో చూడాలి..!