రేపు తిరుమలకు సీఎం జగన్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు సీఎం జగన్. ఇందులో భాగంగానే… రేపు మధ్యాహ్నం 3.35 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి జగన్.. అలిపిరి వద్ద తిరుమలకు విద్యుత్ బస్సును ప్రారంభించనున్నారు.
![cm jagan](https://cdn.manalokam.com/wp-content/uploads/2022/05/move-review-ppas-only-to-ensure-competitive-prices-cm-jagan-mohan-reddy.jpg)
రాత్రి 8.20 గంటలకు శ్రీవారికి పట్టువ్రస్తాలు సమర్పించనున్న సీఎం జగన్… రాత్రికి తిరుమలలోనే బసచేయనున్నారు. బుధవారం ఉదయం మరోసారి శ్రీవారిని దర్శించుకోనున్నారు జగన్.
తిరుమలలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నిర్మించిన పరకామణి భవనాన్ని, తర్వాత లక్ష్మీ వీపీఆర్ రెస్ట్‌హౌస్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్…. ఎల్లుండి నంద్యాలకు వెళ్లనున్నారు. బుధవారం ఉదయం రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. ఓర్వకల్లు ఎయిర్ పోర్టు నుంచి హెలి కాప్టర్‌లో నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలోని రాంకో సిమెంట్ ఫ్యాక్టరీకి వెళనున్నారు సీఎం జగన్.