ముఖంపై చిన్న మొటిమ వచ్చినా దాచేయాలని చూస్తాం. అదే సమస్య పెద్దదైతే.. బాధ, కుంగిపోవడం! తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం. కానీ వీళ్లను చూడండి.. వెండితెరను ఏలుతోన్న తారలు. వాళ్లకి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అయితే నయన్ కూడా ఓ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారట.
లేడీ సూపర్‌స్టార్ నయనతార చర్మ సమస్యతో ఏడాదికిపైగా ఇబ్బంది పడింది. దానికి కారణమూ తెలియదు. ఆ మిస్టరీ స్కిన్ డిజార్డర్ కారణంగా చాలా రోజులు కెరియర్‌నీ పక్కనపెట్టాల్సి వచ్చింది. షూటింగ్‌లంటే మేకప్ తప్పదు. కానీ అది వేస్తే ముఖమంతా దద్దుర్లు, విపరీతమైన మంట వచ్చేదట.
కొన్ని ఆహారపదార్థాలూ పడేవి కాదు. అయినా నయన్ కుంగిపోలేదు. కేరళ ఆయుర్వేదంతోపాటు ఇతర చికిత్సల ద్వారా సమస్య నుంచి బయటపడింది. ఇప్పటికీ చర్మ సంరక్షణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. పెద్ద బ్రాండ్‌ల కంటే ఆయుర్వేద ఉత్పత్తులకే ప్రాధాన్యమిస్తుంది. తక్కువ మేకప్‌కే తన ఓటంటుంది.
ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్న నయన్- విఘ్నేశ్ ఈ ఏడాది జూన్‌లో వివాహంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వృత్తిపరంగా ఇద్దరూ బిజీగా ఉంటున్నా అప్పుడప్పుడు విహార యాత్రలు చేస్తున్నారు. చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘గాడ్ ఫాదర్’లో నయనతార కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా అక్టోబరు 5న విడుదలకానుంది. షారుఖ్‌ఖాన్ సరసన ‘జవాన్’, పలు తమిళ చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. ఈ ఏడాది ‘కాతువాకుల రెండు కాదల్’ చిత్రంతో దర్శకుడిగా మెప్పించిన విఘ్నేశ్.. అజిత్‌తో ఓ సినిమా తెరకెక్కించనున్నారు.